CM KCR Distribute Cheques : పంజాబ్ రైతులు, సైనికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక సాయం

ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ తో కలిసి ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చెక్కు అందజేశారు.

CM KCR Distribute Cheques : పంజాబ్ రైతులు, సైనికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక సాయం

Cm Kcr Distribute Cheques

Updated On : May 22, 2022 / 5:40 PM IST

CM KCR Distribute Cheques : పంజాబ్ లో రైతులు, సైనికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. చండీఘడ్ ఠాగూర్ ఆడిటోరియం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతు ఉద్యమంలో అమరులైన 543 మంది పంజాబ్ రైతు కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్ధిక సాయం అందించారు. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ తో కలిసి ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చెక్కు అందజేశారు. రైతులకి చెక్కుల అందజేత కార్యక్రమంలో బికెయు నేత రాకేష్ టికాయత్ కూడా పాల్గొన్నారు.

Cm Kcr: ముచ్చటగా మూడోసారి.. ప్రధాని పర్యటనకు దూరంగా సీఎం కేసీఆర్..

అలాగే, తూర్పు లద్దాక్ సరిహద్దులో గల్వాన్ వ్యాలీలో అమరులైన నలుగురు పంజాబ్ జవాన్ల కుటుంబాలకు కూడా కేసీఆర్ ఆర్థిక సాయం చేశారు. కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం అందజేశారు.

గల్వాన్ లోయలో అమరులైన భారత సైనికుల కుటుంబాలకు, రైతు ఉద్యమంలో మరణించిన రైతులకు ముగ్గురు ముఖ్యమంత్రులు శ్రద్ధాంజలి ఘటించారు. చండీఘడ్ లో రైతులు, సైనిక కుటుంబాలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిచారు.

CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ

ఉత్తరాది రాష్ట్రాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. అనంతరం విందుభేటీలో పలు అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారు. జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తి, దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర, కేంద్రం విధానాలపై చర్చలు జరిపారు.