Telangana Lockdown : కరోనా కట్టడిలో మనమే నెంబర్ 1, లాక్‌డౌన్ గురించి భయపడొద్దు

తెలంగాణలో కొన్ని రోజులుగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో మరోసారి ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Telangana Lockdown : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. కొన్ని రోజులుగా మళ్లీ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో మరోసారి ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కరోనా కట్టడికి మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ గురించి ప్రజలు వర్రీ అవుతున్నారు. లాక్ డౌన్ భయంతో తెలంగాణలో ఉంటున్న ఇతర రాష్ట్రాల వారిలో కొందరు ఇప్పటికే సొంతూళ్లకు పయనం అయ్యారు.

ఈ క్రమంలో తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ పై సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో లాక్ డౌన్ ఉండదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. అలాగే పరిశ్రమల మూసివేత కూడా ఉండదన్నారు. తొందరపడి లాక్ డౌన్ పెట్టే ఆలోచనేది ప్రభుత్వానికి లేదన్నారు. లాక్ డౌన్ గురించి ఎవరూ గాబరా పడొద్దన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వివరించారు. అదే సమయంలో వైరస్ కట్టడికి ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు సీఎం కేసీఆర్.

ప్రజలు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం సహా ఇతర కరోనా జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని, కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమంగా పని చేస్తోందని చెప్పారు. కరోనా కట్టడిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పారు. ఇక స్కూళ్ల నుంచి కరోనా విస్తరించే అవకాశం ఉన్నందునే విద్యా సంస్థలను మూసివేశామన్నారు కేసీఆర్. స్కూళ్ల మూసివేత తాత్కాలికమే అని చెప్పారు.

* తెలంగాణలో లాక్ డౌన్ ఉండదు
* లాక్ డౌన్ పై ఎవరూ గాబరా పడొద్దు
* తొందరపడి లాక్ డౌన్ పెట్టే ఆలోచనలే లేదు
* ఫంక్షన్లకు కూడా ఎక్కువమంది హాజరుకావొద్దు
* ఎవరూ భయపడాల్సిన పని లేదు
* ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలి

ట్రెండింగ్ వార్తలు