KCR: కామారెడ్డిలో కేసీఆర్ పోటీ.. అదే టార్గెట్ తో బరిలోకి.. మైండ్ బ్లాకయ్యే ప్లాన్!
గజ్వేల్లో సీనియర్ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డిని పోటీకి పెట్టి.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేయాలని చూస్తున్నారని తాజా సమాచారం.
CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు. మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS Party) బాస్ కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారా.. గజ్వేల్ (Gajwel)నుంచి ప్రస్తుతం అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం కేసీఆర్.. ఈసారి నియోజకవర్గాన్నే కాదు, జిల్లానే మారబోతున్నారట. తన సొంత స్థానం సిద్ధిపేటను అల్లుడు హరీశ్‌రావుకు (Harish Rao) ఎప్పుడో అప్పగించేసిన కేసీఆర్ గజ్వేల్‌నే అడ్డాగా చేసుకున్నారు.. ఐతే ఈసారి గజ్వేల్‌ను విడిచిపెట్టి మరోస్థానంపై ఫోకస్ పెట్టారట. ఇందుకోసం ఇప్పటిదాకా రకరకాల నియోజకవర్గాల పేర్లు చర్చల్లోకి వచ్చాయి. మొదట్లో ఆలేరు (Aler) అని.. ఆ తర్వాత మునుగోడు(Munugodu), పెద్దపల్లి (Peddapalli), కామారెడ్డి (Kamareddy) ఇలా రకరకాల పేర్లు చర్చల్లో నానాయి. వీటిపై సర్వేలపై సర్వేలు చేయిస్తూ.. ఏ స్థానమైతే ఎలా ఉంటుంది? రికార్డు మెజార్టీ వస్తుందా? తాను అక్కడి నుంచి పోటీ చేస్తే ఆ ఎఫెక్ట్ చుట్టుపక్కల జిల్లాలపై ఉండబోతోంది? అని ఆరా తీస్తున్న కేసీఆర్.. పోటీ చేయబోయే స్థానంపై ఓ నిర్ణయానికి వచ్చేశారట.
సీఎం కేసీఆర్.. గెలుపుపై కాదు.. గెలిచే మెజార్టీపైనే ప్రతి ఒక్కరి ఫోకస్ ఉంటుంది. ఐతే ఈసారి ముఖ్యమంత్రి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణా ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు గజ్వేల్లోనే పోటీ చేసిన సీఎం కేసీఆర్.. ఈసారి మరో స్థానానికి మారేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం సిద్ధిపేట. మంత్రి హరీశ్‌రావుకు అప్పగించిన తర్వాత మళ్లీ అటు వైపు చూడలేదు. ఉద్యమ సమయంలో కరీంనగర్, మెదక్ జిల్లాల నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహించిన సీఎం.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గజ్వేల్ నుంచే పోటీ చేస్తున్నారు. అక్కడ బలమైన క్యాడర్ ఏర్పడటం.. మెదక్ జిల్లాలో పార్టీకి తిరుగులేని పరిస్థితి ఉండటంతో ఈసారి మరో జిల్లా నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట సీఎం కేసీఆర్.
Also Read: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చేసిన నాగం జనార్దన్‌రెడ్డి.. ఇంతకీ ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలుసా?
గజ్వేల్లో సీనియర్ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డిని (Vanteru Pratap Reddy) పోటీకి పెట్టి.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేయాలని చూస్తున్నారని తాజా సమాచారం. తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలో ఇప్పటికే పలు దఫాలుగా సర్వే కూడా చేయించినట్లు చెబుతున్నారు. ఇలా ఒకటికి పది సర్వేలు జరిపించిన సీఎం ఉమ్మడి నిజామాబాద్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చేశారట. తన గెలుపునకు డోకా లేకపోయినా.. తన ప్రభావంతో ఉమ్మడి జిల్లా మొత్తాన్ని క్లీన్‌స్వీప్ చేయడమే టార్గెట్‌గా కామారెడ్డిలో పోటీ చేయాలని భావిస్తున్నారు సీఎం.. కామారెడ్డిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసినా.. మాస్టర్ ప్లాన్ విషయంలో పెద్ద రగడే జరగడంతో ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు సీఎం.
Also Read: బీఆర్‌ఎస్, బీజేపీ టార్గెట్‌గా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్.. పెరిగిన నేతల తాకిడి
ఉత్తర తెలంగాణలో బీజేపీని దెబ్బతీసేందుకు కామారెడ్డిలో పోటీ చేస్తేనే బెటరనే నిర్ణయానికి వచ్చారట గులాబీబాస్. ఉద్యమ సమయం నుంచి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్‌కు గట్టి పట్టు ఉంది. కానీ, గత లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానాన్ని కోల్పోయింది బీఆర్ఎస్.. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. కమలం పార్టీకి ఈ ఎన్నికల్లో చెక్ చెబితే.. భవిష్యత్లో మరి కోలుకోలేదని కేసీఆర్ ఆలోచన.. అలాగే తాను కామారెడ్డి బరిలో దిగడం ద్వారా ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ , ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోనూ ఉంటుందని సర్వేలు తేల్చాయని చెబుతున్నారు. దాదాపు అన్ని సర్వేల్లోనూ ఇదే రిజల్ట్ వస్తుండటంతో కామారెడ్డి నుంచి పోటీకి ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలను అలెర్ట్ చేసినట్లు చెబుతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే కొద్దిరోజుల్లో ఈ విషయంపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు బీఆర్ఎస్ నేతలు.