CM KCR Meeting with farmers union leaders : 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం..

సీఎం కేసీఆర్ 26 రాష్ట్రాలకు సంబంధించి రైతు సంఘాల నేతలో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. దేశంలో నెలకొన్ని వ్యవసాయం రంగం పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో వ్యవసాయం అనుబంధ రంగాల పురోగతి గురించి చూడా చర్చించనున్నారు.

cm kcr meeting with 26 states farmers union leaders : సీఎం కేసీఆర్ 26 రాష్ట్రాలకు సంబంధించి రైతు సంఘాల నేతలో హైదరాబాద్ లో సమావేశమయ్యారు. దేశంలో నెలకొన్ని వ్యవసాయం రంగం పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో వ్యవసాయం అనుబంధ రంగాల పురోగతి గురించి చూడా చర్చించనున్నారు. తెలంగాణలో వ్యవసాయాన్ని, సాగునీటి అభివృద్దిని పరిశీలించేందుకు దేశవ్యాప్తంగా రైతుసంఘాల ప్రతినిధులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. 25 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు తెలంగాణ పర్యటనకోసం హైదరాబాద్ కు విచ్చేసారు. ప్రత్యేకంగా తెలంగాణ టూరిస్ట్ బస్సుల్లో వీరిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ విధానాలను, నీటి పారుదల ప్రాజెక్టులను ఈ రైతు సంఘాల ప్రతినిధులు పరిశీలించనున్నారు.

ప్రగతి భవన్‌ వేదికగా సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రైతు సదస్సు జరుగుతోంది. ప్రగతి భవన్‌ వేదికగా జరుగనున్న సదస్సులో 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయరంగంలో నెలకొన్న పరిస్థితులతో పాటు.. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని ఆయా రాష్ట్రాల రైతు సంఘాల నేతలు తిలకించనున్నారు. అనంతరం రైతు సంఘాల నేతలతో కలిసి సీఎం కేసీఆర్‌ మధ్యాహ్న భోజనం చేయనున్నారు. లంచ్ అనంతరం సదస్సు తిరిగి కొనసాగనుంది.

తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయ, సాగునీటి రంగలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధ్యయనం చేయటానికి.. ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌, జార్ఖండ్‌, ఒడిశా సహా 25 రాష్ర్టాలకు చెందిన వందమందికి పైగా రైతుసంఘాల నాయకులు, ప్రతినిధులు శుక్రవారమే హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలను స్వయంగా పరిశీలించనున్నారు. నగరంలోని హోటల్‌ టూరిజం ప్లాజాలో బస చేసిన రైతుప్రతినిధుల బృందం.. మూడు రోజులపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది.

ఇప్పటికే జాతీయ రాజకీయలపై ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్‌ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తున్నారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం లంచ్, జాతీయ రైతు సంఘాల నేతలతో కలిసి భోజన కార్యక్రమంలో పాల్గొంటారు. లంచ్ తరువాత సదస్సు తిరిగి కొనసాగుతుంది.

 

ట్రెండింగ్ వార్తలు