Revanth Reddy : ఆ ఒక్క విషయంలో తప్ప కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే, మూడో విజయం తెలంగాణలోనే- రేవంత్ రెడ్డి
స్వేచ్ఛతో కూడుకున్న తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. సమానమైన అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యం అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. Revanth Reddy - CM KCR
Revanth Reddy - CM KCR (Photo : Twitter, Google)
Revanth Reddy – CM KCR : చేవెళ్ల ప్రజాగర్జన సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. మంత్రివర్గంలో మాదిగలకు స్థానం లేదన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ముదిరాజ్ లకు టికెట్ కేటాయించలేదన్నారు. అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ ఆదుకోలేదన్నారు.
తెలంగాణ ఉద్యమంలో అమరులైంది దళితులే అని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ వాగ్దానాలు అమలయ్యాయా? అని ఆయన ప్రశ్నించారు. స్వేచ్ఛతో కూడుకున్న తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. సమానమైన అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యం అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Also Read..BRS Leaders Comments: అత్యుత్సాహం ప్రదర్శిస్తే హాట్‌టాపిక్‌గా మారడం ఖాయం!
”కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతారు. కేసీఆర్ వాళ్ళ అమ్మ నాన్న పేరు తప్ప అన్నీ అబద్ధాలే మాట్లాడతారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ మొదటి విజయం సాధించింది. కర్ణాటకలో రెండవ విజయం సాధించింది. మూడవ విజయం తెలంగాణలో సాధిద్దాం” అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
