CM KCR : సాగర్ ప్రజలకు కృతజ్ఞతలు – సీఎం కేసీఆర్
నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలియచేశారు. నోముల భగత్ ను గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు, ఎవరు ఎన్నిరకాల దుష్ప్రచారం చేసినా..తాము అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు విశ్వాసం ఉంచారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Cm Kcr
Nagarjuna Sagar : నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలియచేశారు. నోముల భగత్ ను గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు, ఎవరు ఎన్నిరకాల దుష్ప్రచారం చేసినా..తాము అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు విశ్వాసం ఉంచారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజాసేవకు మరింత పునరంకితమవుతామని వెల్లడించారు.
ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తామన్నారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్ తో పాటు సాగర్ నియోజకవర్గాన్ని సందర్శించి..ప్రజల సమస్యలను పరిష్కరిస్తానన్నారు. కోదాడ పరిధిలో ఇటీవలే మంజూరు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను శరవేగంగా పూర్తి చేసి ప్రజలకు నీరందిస్తామన్నారు. చక్కగా ప్రజా సేవ చేసి మంచి రాజకీయ భవిష్యత్ కు పునాదులు వేసుకోవాలని నోముల భగత్ కు సీఎం కేసీఆర్ సూచించారు. గెలుపునకు కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలియచేశారు.
Read More : Tamil Nadu Election Result 2021: నాడు తాత.. నేడు మనవడు.. కంచుకోటలో జయకేతనం!