Tamil Nadu Election Result 2021: నాడు తాత.. నేడు మనవడు.. కంచుకోటలో జయకేతనం!

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో ముందుగా ఊహించిన విధంగానే కౌంటింగ్ మొదలైన రెండు గంటలలో విజయం తేలిపోయిన రాష్ట్రాలలో తమిళనాడు ఒకటి. తమిళనాడు 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 140కి పైగా స్థానాలలో డీఎంకే ఇక్కడ విజయఢంకా మోగించింది.

Tamil Nadu Election Result 2021: నాడు తాత.. నేడు మనవడు.. కంచుకోటలో జయకేతనం!

Tamil Nadu Election Result 2021

Tamil Nadu Election Result 2021: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో ముందుగా ఊహించిన విధంగానే కౌంటింగ్ మొదలైన రెండు గంటలలో విజయం తేలిపోయిన రాష్ట్రాలలో తమిళనాడు ఒకటి. తమిళనాడు 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 140కి పైగా స్థానాలలో డీఎంకే ఇక్కడ విజయఢంకా మోగించింది. ఏఐడీఎంకె-బీజేపీ పాచిక ఇక్కడ ఏ మాత్రం పారలేదు. మధ్యాహ్నం నుండే చెన్నైలో డీఎంకే సంబరాలు మొదలవగా పార్టీలో కీలకమైన వ్యక్తులంతా విజయం సాధించారు. వారిలో సినీ నటుడు, మాజీ సీఎం కరుణానిధి మనవడు, ప్రస్తుత సీఎం అభ్యర్థి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నారు.

ఉదయనిధి గెలిచిన చెపాక్ నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు ఉదయనిధి తాత కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన చెపాక్‌ నియోజకవర్గం ఆ కుటుంబానికి కంచుకోటని చెప్పుకుంటారు.1996, 2001, 2006లో వరుసగా మూడు సార్లు చెపాక్‌ నుంచి కరుణానిధి అసెంబ్లీకి వెళ్లగా ఇందులో రెండుసార్లు ఆయన సీఎం అయ్యారు. అయితే, తర్వాత 2008లో చెపాక్‌, ట్రిప్లికేన్‌ ప్రాంతాలను విలీనం చేయగా తర్వాత 2011, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ డీఎంకే ఇక్కడ జయకేతనం ఎగరవేసింది.

కాగా, ఇప్పుడు మళ్ళీ ఉదయనిధి తాత స్థానంలోనే రాజకీయ అరంగేట్రం చేయడం అదృష్టంగా భావించగా మరోసారి చెపాక్ కోటాపై గెలుపు జెండా ఎగరేసి తాతకు తగ్గ మనవడిగా నిలిచారు. మూడేళ్ల కిందటే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఉదయనిధి డీఎంకే యూత్‌ వింగ్‌ సెక్రటరీగా ఉన్నారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. అయితే అరంగేట్రంలోనే కీలక చెపాక్‌-ట్రిప్లికకేన్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించటం విశేషం. అటు హీరోగా గ్లామర్ టచ్ తో పాటు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉదయనిధి పరిపూర్ణ రాజకీయ నాయకుడైపోయారు.