ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన

50కి పైగా బిజినెస్ మీటింగ్ లలో రేవంత్ బృందం పాల్గొంది. ఈ పర్యటనలో ప్రపంచంలో పేరొందిన కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి.

ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన

Cm Revanth Reddy America Tour (Photo Credit : Facebook)

Cm Revanth Reddy America Tour : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ అటు నుంచి దక్షిణ కొరియాకు బయల్దేరారు. అమెరికాలో 19 కంపెనీలతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 31,532 కోట్ల పెట్టుబడులు, దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు రానున్నాయి. అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ 4.0 సిటీ ప్రాజెక్ట్ కు భారీ స్పందన లభించింది.

50కి పైగా బిజినెస్ మీటింగ్ లలో రేవంత్ బృందం పాల్గొంది. ఈ పర్యటనలో ప్రపంచంలో పేరొందిన కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం కార్నింగ్‌, ఆమ్జెన్, జొయిటిస్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. హైదరాబాద్‌లో తమ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ నిర్ణయించింది. యాపిల్, గూగుల్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలు, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో చర్చలు జరిపారు సీఎం రేవంత్. తెలంగాణ పెట్టుబడులు పెట్టాలని కోరారు.

Also Read : విలీన ప్రచారం అబద్ధమని చెప్పుకోడానికి బీఆర్ఎస్, బీజేపీ నేతల తంటా