Cm Revanth Reddy : ఏసీ రూముల నుంచి బయటకు రావడం లేదు- ఐఏఎస్ అధికారుల వ్యవహారశైలిపై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
ఇలా చేస్తే ఏదో ఒక రోజు ప్రజలకు కానీ, రాష్ట్రానికి కానీ, మీకు కానీ ఇబ్బంది అవుతుంది అని వివరించే వారు.

Cm Revanth Reddy : సివిల్ సర్వీస్ అధికారులు గతంలో నిత్యం ప్రజల్లో ఉండేవారిని, ప్రస్తుతం కొందరు కలెక్టర్లు ఏసీ గదుల నుంచి బయటకు రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో రాజకీయ నాయకులు ఏదైనా నిర్ణయం తీసుకుంటే, అధికారులు అందులోని లాభనష్టాలను వివరించే వారని చెప్పారు. ఇప్పుడు అలాంటి వారు లేరని వ్యాఖ్యానించారు.
అధికారుల ఆలోచనా విధానంలో మార్పు రావాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిబద్దత కలిగిన అధికారులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్ స్టిట్యూట్స్ లో లైఫ్ ఆఫ్ ఎ కర్మ యోగి అనే పుస్తకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గోపాలక్రిష్ణన్ రచించారు.
Also Read : పెళ్లిలో తీవ్ర విషాదం.. గుర్రం ఎక్కిన కాసేపటికే పెళ్లి కొడుకు మృతి.. షాక్ లో బంధుమిత్రులు, గెస్టులు..
‘గతంలో అధికారులు చాలా మంది 70 నుంచి 80శాతం మంది అధికారులు రాజకీయ నాయకులు ఏవైనా అంశాలు ప్రస్తావించినప్పుడు అందులో ఉంటే లోటు పాట్లు లేదా అది చేయడం వల్ల జరిగే నష్టాన్ని లేకపోతే చట్ట విరుద్ధంగా రేపు ఏ విధంగా సమస్య అవుతుందో వివరించే వాళ్లు. నాయకులను చైతన్య పరిచే వారు. సర్ ఇలా చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి.
ఇలా చేస్తే ఏదో ఒక రోజు ప్రజలకు కానీ, రాష్ట్రానికి కానీ, మీకు కానీ ఇబ్బంది అవుతుంది అని వివరించే వారు. ఈ రోజుల్లో అది తగ్గిపోయింది. కారణం ఏంటో నాకు పెద్దగా తెలియదు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనే వాళ్లకు వచ్చిన వాళ్లను సంతోష పెట్టాలనో, లేదంటే తనకు తాను సంతోషపడాలని కొన్ని ఆదేశాలు ఇస్తుంటారు.
వాటిని విశ్లేషించాల్సిన బాధ్యత అధికారులదే అని బలంగా నమ్ముతున్నా.. పదే పదే నేను ఇన్సిస్ట్ చేస్తున్నా. ఫీల్డ్ కి వెళ్లమని. కానీ, ఏసీ రూముల నుంచి బయటకు వెళ్లడానికే అధికారులు ఆలోచిస్తున్నారు. నాకు తెలియదు మరి. ఏసీ అనేది ఏమైనా జబ్బు ఏమో. ప్రజల దగ్గరికి వెళ్లినప్పుడు ఒక ఐఏఎస్ కానీ, ఒక ఐపీఎస్ కానీ డిస్ట్రిక్స్ ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన అనుభవం చాలా రిచ్ గా ఉంటుంది’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.