Cm Revanth Reddy : ఏప్రిల్ 3న తెలంగాణ క్యాబినెట్ విస్తరణ..! గవర్నర్‌తో సీఎం రేవంత్ కీలక భేటీ..
మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎవరెవరికి అవకాశం ఉంటుంది, మంత్రివర్గంలో మార్పులు తదితర వివరాలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ గవర్నర్ కు..

Cm Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సమావేశం అయ్యారు. ఉగాది పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రాజ్ భవన్ కు వెళ్లారు. మంత్రివర్గ విస్తరణ ప్రధాన అజెండాగా గవర్నర్ తో చర్చిస్తున్నట్లు సమాచారం. క్యాబినెట్ విస్తరణపై గవర్నర్ కు సమాచారం అందించారు. సీఎం రేవంత్ పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కొందరు కీలక నేతలు ఉన్నారు.
సీఎం రేవంత్, గవర్నర్ ఏకాంతంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి చర్చించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 3వ తేదీన క్యాబినెట్ విస్తరణ జరగొచ్చన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎవరెవరికి అవకాశం ఉంటుంది, మంత్రివర్గంలో మార్పులు తదితర వివరాలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ గవర్నర్ కు వివరించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది. నాలుగు లేదా ఐదు మంత్రి పదవులు భర్తీ చేయొచ్చని సమాచారం.
Also Read : దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేస్తున్న డీలిమిటేషన్.. రేవంత్ టార్గెట్ అదేనా ? పోరులో కీలకం కాబోతున్నారా?
ముఖ్యమంత్రి వెంట కీలక నేతలు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ ఉన్నారు. వారు రాజ్ భవన్ లోనే ఉన్నప్పటికీ.. గర్నవర్, సీఎం జరుపుతున్న చర్చల్లో వారెవరూ పాల్గొనలేదు. మంత్రివర్గ విస్తరణ అంశంతో పాటు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను కూడా గవర్నర్ కు సీఎం రేవంత్ వివరించే అవకాశం ఉంది. కీలకమైన పలు బిల్లలుకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
గవర్నర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకాంతంగా భేటీ కావడంతో వీరి మధ్య అత్యంత ప్రాధాన్యత అంశాలు డిస్కషన్ కు వచ్చినట్లు సమాచారం. ఈ కారణంగానే ఈ భేటీలో ఇతర నేతలు పాల్గొనేందుకు అవకాశం ఇవ్వలేదనే చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఆశావహులు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. క్యాబినెట్ విస్తరణలో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
Also Read : తెలంగాణలో వృద్ధులకు 5లక్షల వరకు ఆరోగ్య బీమా.. ఏప్రిల్ నుంచి అమల్లోకి.. ఏఏ ఆస్పత్రుల్లో చికిత్స పొందొచ్చంటే..
కాగా, సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుంటూ క్యాబినెట్ లో ఖాళీగా ఉన్న 6 స్థానాల్లో మూడు లేదా నాలుగు స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు క్యాబినెట్ లో స్థానం దక్కని మైనార్టీలతో పాటు బీసీ నినాదాన్ని ప్రభుత్వం అందుకోవడంతో బీసీలకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కవచ్చన్న చర్చ నడుస్తోంది. సామాజిక సమీకరణాల ఆధారంగా క్యాబినెట్ విస్తరణలో ఎవరెవరికి చోటు కల్పిస్తామన్న సమాచారాన్ని గవర్నర్ కు సీఎం రేవంత్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.