Cm Revanth Reddy: తాట తీస్తా.. వారికి సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..

వర్ష విపత్తు నుంచి నగరాన్ని కాపాడేందుకే హైడ్రాని తీసుకొచ్చామన్నారు. కనుమరుగైన బతుకమ్మ కుంటను పునరుద్ధరించిన హైడ్రాను సీఎం రేవంత్ అభినందించారు.

Cm Revanth Reddy: తాట తీస్తా.. వారికి సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..

Updated On : September 29, 2025 / 2:13 AM IST

Cm Revanth Reddy: చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడితే తాట తీస్తామం అంటూ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో చెరువుల అభివృద్ధి కోసం హైడ్రాను తీసుకొచ్చామన్నారు. అంబర్ పేట్ లో బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కుంట వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు.

కబ్జాకు గురైన బతుకమ్మ కుంటలో ఆక్రమణలు తొలగించిన హైడ్రా 7వేల కోట్లతో చెరువుని పునరుద్ధరించింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ ఎంసీ మేయర్ విజయలక్ష్మి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు.

మారిన వాతావరణ పరిస్థితుల వల్లే పలు నగరాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని సీఎం రేవంత్ చెప్పారు. హైదరాబాద్ నగరంలోనూ అదే తరహా పరిస్థితి ఉందన్నారు. నగరంలో అకస్మాత్తుగా వానలు కురుస్తున్నాయని సీఎం రేవంత్ అన్నారు. 2 సెంటీమీటర్ల వర్షానికే నగరం అస్తవ్యస్తం అవుతోందన్నారు. వర్ష విపత్తు నుంచి నగరాన్ని కాపాడేందుకే హైడ్రాని తీసుకొచ్చామన్నారు. కనుమరుగైన బతుకమ్మ కుంటను పునరుద్ధరించిన హైడ్రాను సీఎం రేవంత్ అభినందించారు.

” వాతావరణంలో మార్పులతోనే విపత్కర పరిస్థితులు. మూసీ సుందరీకరణకు సహకరించండి. మూసీ నిర్వాసితులకు పక్కా ఇళ్లు కట్టిస్తాం. పేదల కోసమే బతుకమ్మ కుంట నిర్మించాం. చెరువులను కబ్జా చేస్తే తాట తీస్తాం. అంబర్ పేట బతుకమ్మ కుంటకు వీహెచ్ పేరు పెడుతున్నాం” అని సీఎం రేవంత్ తెలిపారు.