ఈ విషయంలో కేంద్రం సహకరించాలని ప్రధాని మోదీని కోరాను: రేవంత్ రెడ్డి

కేంద్ర సర్కారు సహకారం ఉంటే దేశంలోని రాష్ట్రాల అభివృద్ధి సమగ్రంగా జరుగుతుందని చెప్పారు.

ఈ విషయంలో కేంద్రం సహకరించాలని ప్రధాని మోదీని కోరాను: రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

Updated On : January 12, 2025 / 4:17 PM IST

తెలంగాణ రాష్ట్రం ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మెట్రోతో పాటు రీజనల్‌ రింగ్‌రోడ్డు విషయంలో కేంద్ర సర్కారు సహకరించాలని తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరానని తెలిపారు.

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణాలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు రచించిన ఉనిక పుస్తకాన్ని విడుదల చేసి, అనంతరం రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. అవసరం ఉన్న రంగాల్లో విపక్ష నేతల అనుభవాన్ని కూడా వాడుకోవడానికి తాము సిద్ధమని తెలిపారు. కేంద్ర సర్కారు సహకారం ఉంటే దేశంలోని రాష్ట్రాల అభివృద్ధి సమగ్రంగా జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్‌ మెట్రో విస్తరణ కోసం అనుమతులు తెచ్చుకోవాల్సి ఉందని తెలిపారు.

హైదరాబాద్‌ మెట్రో ఒకప్పుడు రెండోస్థానంలో ఉండేదని, ఇప్పుడు తొమ్మిదో స్థానానికి పడిపోయిందని చెప్పారు. రాష్ట్రానికి చెందిన ప్రయోజనాల కోసం పలు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు కలిసి పోరాడుతున్నాయని తెలిపారు. తెలంగాణ పోటీ పడాల్సింది అమరావతితో కాదని, ప్రపంచస్థాయిలో అభివృద్ధి చెందిన నగరాలతోనని రేవంత్ రెడ్డి చెప్పారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి భారత్‌ తరఫున వెళ్తున్న కేంద్ర మంత్రి ఎవరో తెలుసా?