Congress – CPM : సీపీఎం నేతలతో బుజ్జగింపులు చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. తమ్మినేనికి ఫోన్ చేసి పోటీపై పునరాలోచన చేయాలని కోరిన భట్టి విక్రమార్క

సీపీఎం అభ్యర్థులతో కాంగ్రెస్ కు ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఖమ్మం, పాలేరు, మధిర, మిర్యాలగూడ లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపుపై తీవ్ర ప్రభావం ఉండనున్నట్లు తెలుస్తోంది.

Bhatti Vikramarka called Tammineni

Congress Appeasement With CPM Leaders : ఎన్నికల్లో కాంగ్రస్ తో పోత్తు కుదరకపోవడంతో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 14 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం బరిలోకి దిగనున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో కలవరం మొదలైంది. సీపీఎం అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలకు దిగింది.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకి ఫోన్ చేశారు. పోటీపై మరోసారి పునరాలోచన చేయాలని కోరారు. అటు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సైతం రంగంలోకి దిగారు. ఈ మేరకు తమ్మినేనితో చర్చలు జరుపుతున్నారు. కాంగ్రస్ పొత్తు వికటించడంతో ఇప్పటికే సీపీఎం 14 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. సీపీఎం పోటీ చేసే స్థానాల్లో కాంగ్రెస్ కు ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది.

CPM Candidates List Released: 14 మందితో సీపీఎం అభ్యర్ధుల జాబితా విడుదల.. పాలేరు బరిలో తమ్మినేని వీరభద్రం

సీపీఎం అభ్యర్థులతో కాంగ్రెస్ కు ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఖమ్మం, పాలేరు, మధిర, మిర్యాలగూడ లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపుపై తీవ్ర ప్రభావం ఉండనున్నట్లు తెలుస్తోంది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేతలు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో చర్చలు జరుపుతున్నారు. సీపీఎం మాత్రం కాంగ్రెస్ తో ససేమిరా అంటున్నట్లు సమాచారం.

అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి వెళ్లాలని భావించాయి. కాంగ్రెస్ తో సీపీఎం, సీపీఐ పొత్తులు పెట్టుకోవాలని నిర్ణయించాయి. పొత్తులో భాగంగా సీపీఎం, సీపీఐకి చెరో రెండు స్థానాలు కేటాయిస్తామని కాంగ్రెస్ చెప్పింది. సీపీఎంకు మిర్యాలగూడ, వైరా. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను కేటాయిస్తామని తెలిపింది.

Pawan Kalyan : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో జనసేన పోటీ.. మరో రెండు సీట్లపై బీజేపీతో చర్చలు : పవన్ కళ్యాణ్

అయితే వామపక్షాలకు కేటాయించిన స్థానాలపై కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వలేదు. ఇందులో భాగంగా సీపీఎం అడిగిన మిర్యాలగూడ, వైరా స్థానాలపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వలేదు. తమకు కేటాయించే స్థానాలపై స్పష్టత ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇవ్వాలన్నారు. ఆ మేరకు మొన్న మధ్యాహ్నం 3 గంటల వరకు కాంగ్రెస్ కు డెడ్ లైన్ విధించారు.

కానీ,  సీపీఎంకు కేటాయించే స్థానాలపై కాంగ్రెస్ స్పందించలేదు. దీంతో సీపీఎం.. కాంగ్రెస్ తో పొత్తు తెగదెంపులు చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించింది. ఈ మేరకు సీపీఎం 14 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. సీపీఐ కూడా సీపీఎంలో దారిలో వెళ్లనున్నట్లు తెలుస్తోంది.