Telangana Congress Cabinet: కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశం ఉన్న నేతలు వీరే?

ముఖ్యమంత్రి, ఒకరిద్దరు ఉప ముఖ్యమంత్రులు ఈరోజు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

Telangana Congress Cabinet: కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశం ఉన్న నేతలు వీరే?

Revanth Reddy

Telangana Congress : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అధికార పీఠాన్ని దక్కించుకొనేందుకు కావాల్సిన సీట్లు ఆ పార్టీకి వచ్చాయి. దీంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇవాళ సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థులను ఎన్నుకోనున్నారు. మంత్రి వర్గం కూర్పుపైనా ఈ సమావేశంలో చర్చజరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఇవాళ సాయంత్రంకే  సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. లేకుంటే.. ఈనెల 6వ తేదీన ప్రమాణ స్వీకారం ఉండనున్నట్లు తెలుస్తోంది.

Also Read : Telangana Election 2023 Results: రాష్ట్రంలో నోటాకు పోలైన మొత్తం ఓట్లెన్నో తెలుసా? ఏ నియోజకవర్గంలో ఎక్కువ అంటే..

రాజ్ భవన్ లోనే ప్రమాణ స్వీకారం..?
ముఖ్యమంత్రి, ఒకరిద్దరు ఉప ముఖ్యమంత్రులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరు రాజ్ భవన్ లోనే ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఇప్పటికే రాజ్ భవన్ లో సౌకర్యాల గురించి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆరా తీసింది. సీఎల్పీ నేత ఎంపిక నిమిత్తం ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తవగానే ఆ నివేదికను అధిష్టానానికి పంపనున్నారు. ఏఐసీసీ నుంచి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల పేర్లపై గ్రీన్ సిగ్నల్ రాగానే తదుపరి కార్యక్రమంను కాంగ్రెస్ అదినాయకత్వం చేపట్టనుంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈరోజు రాజ్ భవన్ లో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈనెల 9న మిగిలిన మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని విజయోత్సవ సభ మాదిరి నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. ఆ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే లతో పాటు పెద్ద సంఖ్యలో ఏఐసీసీ నాయకులను ఆహ్వానించాలని రాష్ట్ర నాయకత్వం యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : Telangana Election Results : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 10మంది మహిళలు.. కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు

మరోవైపు సీఎల్పీ సమావేశంలో మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేయనున్నారు. తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల నుంచి సీనియర్ నేతలు, కొత్తగా గెలిచినవారు మంత్రివర్గంలో చోటు దక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

అదిలాబాద్ జిల్లా :

వివేక్ వెంకట్ స్వామీ (చెన్నూర్)
ప్రేమ్ సాగర్ రావు (మంచిర్యాల)
వెడ్మ బోజ్జు ( ఖానాపూర్)

కరీంనగర్ :

పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్)
శ్రీధర్ బాబు (మంథని)
అది శ్రీనివాస్ (వేములవాడ)

మహబూబ్ నగర్ :

జూపల్లి కృష్ణ రావు (కొల్లాపూర్)
వంశీ కృష్ణ (అచ్చంపేట)
వీర్లపల్లి శంకర్ (షాద్ నగర్ )

వరంగల్:

సీతక్క (ములుగు)
కొండ సురేఖ (వరంగల్ ఈస్ట్)

ఖమ్మం:

భట్టి విక్రమార్క (మధిర)
తుమ్మల నాగేశ్వర రావు (ఖమ్మం)
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( పాలేరు)
కునమనేని సాంబశివ రావు (కొత్తగూడెం) – పొత్తులో భాగంగా క్యాబినెట్ లోకి తీసుకుంటే

నల్గొండ:

ఉత్తమ్ or పద్మావతి
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (నల్గొండ)

మెదక్ :

దామోదర్ రాజనర్సింహ (అందోల్ )

నిజామాబాద్ :

సుదర్శన్ రెడ్డి ( బోధన్)
షబ్బీర్ అలీ (ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి)

రంగారెడ్డి :

మల్ రెడ్డి రంగారెడ్డి ( ఇబ్రహీంపట్నం )
గడ్డం ప్రసాద్ (వికారాబాద్)
రామ్ మోహన్ రెడ్డి (పరిగి)

వీరితో పాటు మరికొంత మంది మంత్రి వర్గంలో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తుందనే విషయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.