MLC Jeevan Reddy
Telangana Congress Leader: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) సిద్ధంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా (Jagityala District) లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా విభేదాలు ఉండటం సహజం. కానీ, ఒక ముదిరాజ్ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా కౌశిక్ రెడ్డి చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పెత్తందారీ విధానం నుంచి వచ్చారు కాబట్టి అలా మాట్లాడుతున్నారని అన్నారు.
Mallu Ravi : జేపీ నడ్డా ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్నారు.. బండి సంజయ్ చేయబోమన్నారు : మల్లు రవి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా జోగు రామన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిచడం అభినందించదగిన విషయమన్నారు. దేశంలో బీసీ యాక్షన్ ప్లాన్ అమలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ సర్కార్ అని జీవన్ రెడ్డి విమర్శించారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఇంత చర్చ జరుగుతున్నా బీఆర్ఎస్ పార్టీలో చలనం లేకపోవడం సిగ్గు చేటు అన్నారు. బీసీ ముధిరాజ్ (A) వర్గంలో చేర్చాలని నివేదికలు పంపించలేదు. బీసీల పట్ల ప్రభుత్వానికి వివక్ష ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలం అయ్యిందని అన్నారు.
బీఅర్ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా అందరూ కంకణం కట్టుకున్నారు. గత కొద్దినెలల క్రితం బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంటే.. కర్ణాటక ఫలితాల తరువాత బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌గా మారిందని అన్నారు. దేశంలో అవకాశ వాద పార్టీ బీఆర్ఎస్ అని, మునిగిపోయే నావ అంటూ జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి వస్తే గౌరవించడం మన సంప్రదాయం. కానీ, గౌరవించడం మరిచి అమిత్ షా దగ్గర మోకరిల్లడం ఏమనుకోవాలి అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
మరికొద్ది నెలల్లో తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని జీవన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే 60 స్థానాలకు ఖరారయ్యారని తెలిపారు. ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేసుకుంటున్నారని చెప్పారు. త్వరలో అభ్యర్ధులను ప్రకటిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.