పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. తొలిసారి పెద్దఎత్తున బూత్ స్థాయి కన్వీనర్ల సమావేశం

రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో 14 స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే పార్లమెంటు స్థానాల వారీగా మంత్రులకు, సీనియర్లకు బాధ్యతలు కేటాయించారు.

పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. తొలిసారి పెద్దఎత్తున బూత్ స్థాయి కన్వీనర్ల సమావేశం

Telangana Congress Focus On Parliament Elections 2024

Updated On : January 25, 2024 / 4:44 PM IST

Parliament Elections 2024 : హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బూత్ కన్వీనర్ల సమావేశం జరగనుంది. పార్లమెంటు ఎన్నికల్లో చేపట్టాల్సిన బాధ్యతలపై బూత్ కన్వీనర్లకు, నాయకులకు ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు. తొలిసారిగా పెద్ద ఎత్తున బూత్ కన్వీనర్ల సమావేశం నిర్వహిస్తోంది కాంగ్రెస్. 32వేల మంది బూత్ కన్వీనర్లకు దిశానిర్దేశం చేయనున్నారు ఖర్గే.

రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో 14 స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే పార్లమెంటు స్థానాల వారీగా మంత్రులకు, సీనియర్లకు బాధ్యతలు కేటాయించారు. ఈ సమావేశంలో బూత్ కన్వీనర్లకు కూడా బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మీటింగ్ కు ఏఐసీసీ ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.

Also Read : రేపు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. అభ్యర్థుల విషయంపై కేసీఆర్ క్లారిటీ ఇస్తారా?

బూత్ స్థాయి కన్వీనర్లతో ఇదే తొలి సమావేశం. దేశంలో ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా బూత్ స్థాయి కన్వీనర్లతో సమావేశం అవ్వలేదు. మొట్టమొదటి సమావేశాన్ని తెలంగాణ నుంచే ప్రారంభించబోతోంది. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కూడా బూత్ స్థాయి కన్వీనర్లు అందరినీ ఈ సమావేశానికి పిలిపించారు. దాదాపు 32వేల బూత్ స్థాయులు ఉన్నాయి. వాటి కన్వీనర్లను, పోల్ ఏజెంట్లను ఎల్బీ స్టేడియంకు తరలించారు. బూత్ స్థాయి కన్వీనర్లకు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు.

పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని వారికి చెప్పే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని ఏ విధంగా అయితే చెప్పారో.. అదే విధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఎంపీ సీట్లు అత్యంత కీలకం కాబట్టి.. ఎంపీ సీట్లు ఎక్కువ గెలుపొందాలంటే కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది.

Also Read : పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ సీరియస్.. చర్యలకు ఈసీకి ఆదేశం