Kid: ఆరేళ్ల చిన్నోడు.. ఆరడుగుల పోలీస్ ముందు నిలబడి.. శభాష్ రా బుడ్డోడా!!
పోలీస్.. ఆ పదం వింటేనే గుండెల్లో వణుకు పుట్టే పరిస్థితి.

Kid Police
Kid: పోలీస్.. ఆ పదం వింటేనే గుండెల్లో వణుకు పుట్టే పరిస్థితి. ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా ఏం చేస్తారో అనే భయం ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. పోలీసోళ్ల ముందు మాములుగా నిలబడి మాట్లాడడానికే బయపడుతాం కదా? కానీ ఓ చిన్నోడు ఆరడుగుల పోలీస్ ముందు నిలబడి ధైర్యంగా మాటలో ఏ మాత్రం కొణుకు లేకుండా మాట్లాడాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శభాష్ రా బుడ్డోడా!! అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో దుర్గామాత నిమజ్జనం కార్యక్రమానికి దుర్గామాతను ఊరేగింపుగా తీసుకెళ్తూ డీజే మోగించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సౌండ్ పెట్టొద్దని సూచించారు.
దీంతో అక్కడే ఉన్న ఓ చిన్నోడు.. సార్.. మా దుర్గామాత దగ్గర డీజే ఎందుకు పెట్టనియ్యరు.. ఏమన్నా ఉంటే రేపు చూసుకుందాం.. కానీ ఇప్పుడైతే డీజే పెట్టుకోనీయండి.. అంటూ ఆ ఆరేళ్ల బుడ్డోడు.. పోలీసు అధికారితో.. ఎస్ఐ అని తెలిసి కూడా భయపడకుండా మాట్లాడేశాడు. బుడ్డోడి మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.