తెలంగాణలో 127కు చేరిన కరోనా కేసులు…9 మంది మృతి 

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు 127కు చేరాయి. దీంతో తెలంగాణలో మృతుల సంఖ్య 9కు చేరింది.

  • Published By: veegamteam ,Published On : April 1, 2020 / 11:23 PM IST
తెలంగాణలో 127కు చేరిన కరోనా కేసులు…9 మంది మృతి 

Updated On : April 1, 2020 / 11:23 PM IST

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు 127కు చేరాయి. దీంతో తెలంగాణలో మృతుల సంఖ్య 9కు చేరింది.

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు 127కు చేరాయి. బుధవారం (మార్చి1, 2020) ఒక్కరోజే 30 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మృతుల సంఖ్య 9కు చేరింది. 14 మంది కరోనా బాధితులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కరోనా బాధితుడు మృతి చెందాడు. అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు వైద్యులపై దాడికి పాల్పడ్డాడు. క్లిష్ట పరిస్థితుల్లో సేవలందిస్తున్న వైద్యులపై దాడి సరికాదని ఆసుపత్రి సూపరిండెంట్‌ శ్రవణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను వైద్యారోగ్యశాఖ దృష్టికి తీసుకెళ్లామని శ్రవణ్‌ తెలిపారు. 

కరోనా మహమ్మారి ఎదుర్కొనేందుకు ప్రాణాలు సైతం పణంగా పెట్టిన తమపై దాడికి దిగడం ఏమిటంటూ గాంధీ ఆస్పత్రి జూనియర్‌ డాక్టర్లు ప్రశ్నించారు. మృతుని బంధువులు దాడికి నిరసనగా జూడాలు ఆందోళను దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ జూడాలకు సర్దిచెప్పి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తామని సీపీ హామీ ఇవ్వడంతో వైద్యులు ఆందోళన విరమించారు. అయితే దాడి చేసిన వ్యక్తికి కూడా కరోనా లక్షణాలు ఉండటంతో.. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు క్వారంటైన్‌కు తరలించారు.

దేశ వ్యాప్తంగా గత రెండు మూడు రోజులుగా కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇందుకు కారణం ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదులో జరిగిన మత ప్రార్ధనలే కారణం అని తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్ర  రాష్ట్రాలతో సహా దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులన్నీ ఢిల్లీ మత ప్రార్ధనలతో సంబంధం ఉండటమే దీనికి నిదర్శనం. ఇప్పడు దేశంలో అందరి దృష్టి నిజాముద్దీన్ మర్కజ్ మసీదుపైనే ఉంది. 

ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతలోని మర్కజ్ మసీదు..మార్చినెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మత ప్రార్థనలు జరిగాయి. ఆ ప్రార్థనలకు దేశ, విదేశాల నుంచి ప్రజలు హాజరయ్యారు. మలేసియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కిర్గిస్తాన్‌‌తో పాటు పలు దేశాలకు చెందిన మత ప్రచారకులు వచ్చారు. అలా వచ్చిన వారు వైరస్ ని…. ప్రార్థనలకు హాజరైన వారికి అంటించారు. ప్రార్థనలు ముగిశాక ఎవరి స్వస్థలాలకు వాళ్లు వెళ్లిపోయారు. అలా ఒకరినుంచి మరోకరికి కరోనా వైరస్ సోకింది. వారిలో ఒక్క తెలంగాణలోనే ఆరుగురు ఇటీవల మృతి చెందారు. ఆ ఆరుగురే కాక రాష్ట్రంలో కరోనా సోకిన వారు ఇంకెందరో ఉన్నారు

తెలంగాణ రాష్ట్రం నుంచి 380 మంది మర్కజ్ ప్రార్థనలకు వెళ్లినట్లు తేలింది. హైదరాబాద్ 186, నిజామాబాద్ 18, మెదక్ 26, నల్గొండ 21, ఖమ్మం 15, ఆదిలాబాద్ 10, రంగారెడ్డి 15, వరంగల్ 25, కరీంనగర్ 17,మహబూబ్ నగర్ 25, భైంసా 11, నిర్మల్ 11 మంది ప్రార్థనల్లో పాల్గొన్నారు.

Also Read | కరోనా నివారణకు సాయికుమార్ ‘నాలుగో సింహం’ డైలాగ్