కరోనాను ఆషామాషీగా తీసుకోవద్దు…జాగ్రత్తలు తీసుకోండి.. నివారణకు ప్రభుత్వం చర్యలు

తెలంగాణ గడ్డపై ఒక్కరికి కూడా కరోనా వైరస్ సోకలేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా ఉందన్నారు.

  • Published By: veegamteam ,Published On : March 18, 2020 / 12:36 PM IST
కరోనాను ఆషామాషీగా తీసుకోవద్దు…జాగ్రత్తలు తీసుకోండి.. నివారణకు ప్రభుత్వం చర్యలు

Updated On : March 18, 2020 / 12:36 PM IST

తెలంగాణ గడ్డపై ఒక్కరికి కూడా కరోనా వైరస్ సోకలేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా ఉందన్నారు.

తెలంగాణ గడ్డపై ఒక్కరికి కూడా కరోనా వైరస్ సోకలేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ నుంచి గుల్బర్గా వెళ్లిన ముగ్గురికి కరోనా నెగెటివ్ వచ్చిందన్నారు. కరోనా వైరస్ పై బుధవారం (మార్చి 18, 2020) హైదరాబాద్ లో మంత్రి ఈటల మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా ఉందన్నారు. తెలంగాణలో ఉన్న ఏ ఒక్కరికి కూడా కరోనా సోకలేదన్నారు. 

విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ 
విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ చేస్తున్నామని చెప్పారు. విదేశాల నుంచి దాదాపు 20 వేల మంది వస్తారని అంచనా వేశామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వారందరికి సరపడా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రయణీకులను తరలించేందుకు ఎయిర్ పోర్టులో 40 బస్సులను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారని తెలిపారు. 

గాంధీ, ఉస్మానియా, ఐపీఎంలలో అన్ని ఏర్పాట్లు 
గాంధీ, ఉస్మానియా, ఐపీఎంలలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చినవారు కోలుకుంటున్నారని చెప్పారు. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం వైరస్ ఇంకా సమాజంలోకి వ్యాపించలేదన్నారు. తాము స్కూళ్లు మూసింది బయట తిరగడానికి కాదన్నారు. పిల్లలందరిని ఇంట్లోనే ఉంచేందుకు తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలన్నారు. మాల్స్, పార్కులకు పిల్లలను తీసుకెళ్లవద్దన్నారు. గుంపులుగా ప్రజలెవరూ తిరగవద్దని చెప్పారు. కరోనాను ఆషామాషీగా తీసుకోవదన్నారు. 

శ్రీరామ నవమి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించడం లేదు 
ఇటలీలో సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే ఇంత ప్రమాదం ఏర్పడిందన్నారు. అమెరికా లాంటి దేశమే కర్ఫ్యూ విధిస్తోందన్నారు. శ్రీరామ నవమి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించడం లేదన్నారు. పెళ్లి కార్డులు ముద్రించిన తర్వాత ఆపడం సరికాదనే.. తక్కువ మందితో వివాహ వేడుకలను చేసుకోవాలని చెబుతున్నామని తెలిపారు. అన్నిటికన్నా మనిషి ప్రాణాలే ముఖ్యం అన్నారు. 

జాగ్రత్తలు తీసుకుంటే కరోనా బారి నుంచి తప్పించుకోవచ్చు 
వీలైనంత వరకు సబ్బుతో చేతులు కడుక్కోవడానికి ప్రయత్నించాలన్నారు. జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని, ఇతర ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు. తెలంగాణ ఆరోగ్యవంతంగా ఉండటానికి అందరూ సహకరించాలని కోరారు.