ఇక..హోం క్వారంటైన్ నుంచి తప్పించుకోలేరు

  • Published By: madhu ,Published On : March 30, 2020 / 02:53 AM IST
ఇక..హోం క్వారంటైన్ నుంచి తప్పించుకోలేరు

Updated On : March 30, 2020 / 2:53 AM IST

కరోనా వైరస్ వ్యాపించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకొంటోంది. ఇప్పటికే లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే..వైరస్ బారిన పడి హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతూ..కొంతమంది తప్పించుకుని బయటకు రావడం..భయాందోళనలకు గురి చేస్తోంది. చికిత్స ప్రారంభించే ముందు..వీరి చేతిపై ఓ ముద్ర వేస్తున్నారు. ఈ వ్యక్తి బయట తిరిగితే..వెంటనే గుర్తు పట్టే విధంగా ఈ విధంగా చేస్తున్నారు.

యదేచ్చగా తిరుగుతున్న వీరిని కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేశారు. నగరంలో ఉన్న కాల్ సెంటర్ల ద్వారా హోం క్వారంటైన్ అయిన వారి సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. జిల్లాల పరిధిలో కమ్యూనిటీ, విలేజ్ ఆఫీసర్, పోలీస్ వాచ్ పేరిట మూడు దశల్లో నిఘా పెట్టారు. కమ్యూనిటీ వాచ్ లో హోం క్వారంటైన్ అయిన వారి ఇండ్ల పక్కన ఉండేవారి ఫోన్ నెంబర్లను పోలీసులు సేకరిస్తారు.

* గ్రామాల్లోని ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వీఏవోలు రోజుకొకసారి హోం క్వారంటైన్ అయిన వారి ఇండ్లను తనిఖీలు చేస్తున్నారు. 
* ఒక్క ప్రాంతంలో ఉన్న 15 మంది హోం క్వారంటైన్ నివాసాలను ఇద్దరు కానిస్టేబుళ్లు పర్యవేక్షించనున్నారు. 
 

* వీరు ఆకస్మిక తనిఖీలు చేస్తూ..క్వారంటైన్ అయిన వారిపై నిఘా పెడుతారు. సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియచేస్తారు. 
* HMDA పరిధిలోని కమిషనరేట్లో కోవిడ్ -19 ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు.

ఇదిలా ఉంటే..హోం క్వారంటైన్ ఉన్న సమయంలో వేసిన ముద్ర కనిపించకుండా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. వీరికి చెక్ పెట్టేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీరు ఇంటి నుంచి కాలు బయటపెట్టే వీలు లేకుండా..వారి నివాసాలపై జియో ట్యాగింగ్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను TS Cop Appతో జత చేశారు. హోం క్వారంటైన్ అయిన వ్యక్తి మొబైల్ ఫోన్లో ప్రత్యేక యాప్ ను ఇన్ స్టాల్ చేసి వారు ఎక్కడుంది సులభంగా తెలుసుకొనే ఛాన్స్ ఉందంటున్నారు. 

HMDA పరిధిలోని కాల్ సెంటర్లు : –
* హైదరాబాద్ : 040 – 23434343
* సైబరాబాద్ :  9490617440, 94906147431
* రాచకొండ : 9490617234