Covid-19 : తెలంగాణలో కొత్తగా 8,061 పాజిటివ్ కేసులు
తెలంగాణాలో గడచిన 24 గంటల్లో 8,061 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. 56 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో ఒకే రోజు కోవిడ్, తదితర కారణాలతో మరణాలు నమోదు కావటం రాష్ట్రంలో ఇదే మొదటి సారి. మరో 5,093 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

Telangana Covid 19
Covid-19 : తెలంగాణాలో గడచిన 24 గంటల్లో 8,061 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. 56 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో ఒకే రోజు కోవిడ్, తదితర కారణాలతో మరణాలు నమోదు కావటం రాష్ట్రంలో ఇదే మొదటి సారి. మరో 5,093 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 72,133 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 4,19,966 గా నమోదైంది. నిన్న రాష్ట్రంలో 82,270 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇంతవరకు రాష్ట్రంలో మొత్తం పరీక్షలు నిర్వహించిన వారిసంఖ్య 1,27,48,582 కు చేరింది.
రాష్ట్రంలో రికవరీ రేటు మరింత తగ్గి 82.31 శాతంగా నమోదైంది. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు కోలుకున్నవారి సంఖ్య 3,45,683 గా నమోదైంది. కొత్తగా నమోదైన మరణాలతో కోవిడ్, తదితర సమస్యలతో మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో 2,150 కి పెరిగింది.
ఇలా ఉండగా, గడచిన 24 గంటల్లో GHMC పరిధిలో కొత్తగా 1508 కేసులు నమోదు అయ్యాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి లో 673, రంగారెడ్డి జిల్లాలో 514, కేసులు కొత్తగా నమోదయ్యాయి. అదే సమయంలో, సంగా రెడ్డి జిల్లలో 373, మహబూబ్ నగర్ 328, నల్గొండ జిల్లాలో 311 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. పలు జిల్లాల్లో 2 వందల పైగా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో నిన్న 1,08,888 మందికి కోవిడ్ టీకాలు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న దాదాపు 1100 పైగా వాక్సినేషన్ కేంద్రాలు పనిచేసినట్లు, దీంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ టీకాలు తీసుకున్నవారి సంఖ్య —దాదాపు 44 లక్షలకు చేరిందని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Telangana Covid case Details

Ts District Wise Report