Covid Air borne : వైరస్ పవర్ పెంచుకుంటోంది.. ఎయిర్ బోర్న్‌గా మారింది.. జాగ్రత్త..
కరోనావైరస్ రోజురోజుకీ పవర్ పెంచుకుంటోంది.. మ్యుటేట్ అవుతూ ఎయిర్ బోర్న్ గా మారిపోయింది.. ఇప్పుడు గాలిలోనూ వేగంగా వ్యాపిస్తోంది ఈ మహమ్మారి..

Nit Warangal Assistant Professor Comments On Corona Pandemic
Covid Air borne : కరోనావైరస్ రోజురోజుకీ పవర్ పెంచుకుంటోంది.. మ్యుటేట్ అవుతూ ఎయిర్ బోర్న్ గా మారిపోయింది.. ఇప్పుడు గాలిలోనూ వేగంగా వ్యాపిస్తోంది ఈ మహమ్మారి.. కరోనావైరస్ వ్యాప్తిపై వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లో ఏడాదిగా పరిశోధనలు చేపట్టారు.
నిట్‌లోని డీబీటీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ) ద్వారా రూ.రెండు కోట్ల నిధులతో ఈ పరిశోధనలు పూర్తి చేశారు. కరోనా వైరస్‌పై మూడేళ్ల కాలపరిమితితో పరిశోధనలు కొనసాగాయి. బయోటెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ పెరుగు శ్యాం, గిరీష్ ఈ పరిశోధనల్లో పాల్గొన్నారు.
కరోనా వైరస్ ఎయిర్ బోర్న్‌గా రూపాంతరం చెందిందని పరిశోధకులు వెల్లడించారు. వైరస్ సోకిన వ్యక్తుల్లో తుమ్మినా, దగ్గినా తుంపరలు గాలిలో కలసిపోతుంది.. ఆరు మీటర్ల పరిధి వరకు వెళ్లగల సామర్థ్యం వైరస్‌కు పెరిగిందన్నారు. కరోనా సెకండ్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ దిశగా పయనిస్తోందని హెచ్చరిస్తున్నారు.