Covid Positive : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ రంజిత్‌రెడ్డికి కోవిడ్ పాజిటివ్
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఇద్దరూ హోం ఐసోలేషన్‌కు వెళ్లారు.

Covid (1)
Minister Errabelly Dayakar Rao AND MP Ranjit Reddy : మొన్నటి వరకు వడ్లు కొనాలంటూ హస్తినలో ఫైట్ చేసిన తెలంగాణ మంత్రులు, ఎంపీల్లో కొందరు కరోనా బారిన పడ్డారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఇద్దరూ హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. వీరితోపాటు ఢిల్లీ వెళ్లిన ఇతర నేతలూ కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారు.
తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 140 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 92 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3 వేల 499 యాక్టివ్ కేసులుండగా…మొత్తం 4 వేల 021 మంది చనిపోయారు.
Telangana Government : ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం విడుదల
మరోవైపు రాష్ట్రంలో ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజు రోజుకు వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒమిక్రాన్ కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా..ఎక్కడో ఒకచోట కేసులు నమోదవుతున్నాయి. నిన్న మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 41కి చేరాయి. అయితే ఒమిక్రాన్ బారిన పడి చికిత్స పొందుతున్న వారిలో 10 మంది బాధితులు కోలుకోవడం ఊరటనిచ్చే విషయం.