Cremation cost: మహబూబ్‌నగర్‌లో అంత్యక్రియలకు రూ.5 ఇస్తే చాలు

కొవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాలకు సహాయం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వర్తించేందుకు భయపడుతున్న సమయంలో..

Cremation cost: మహబూబ్‌నగర్‌లో అంత్యక్రియలకు రూ.5 ఇస్తే చాలు

Crematorium (1)

Updated On : May 23, 2021 / 8:02 PM IST

Cremation Cost: కొవిడ్ తో బాధపడి చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వర్తించే ఖర్చును రూ.5గా నిర్ణయించింది జిల్లా అడ్మినిస్ట్రేషన్. ‘కొవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాలకు సహాయం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వర్తించేందుకు భయపడుతున్న సమయంలో.. ఈ రూ.5 ఫీజును లాంచ్ చేసినట్లు ఎక్సైజ్ మినిష్టర్ వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

కుటుంబ సభ్యులెవరైనా మునిసిపల్ కమిషనర్ కు రూ.5 చలానా విధిస్తే సరిపోతుంది. మునిసిపాలిటీ మిగిలినవి చూసుకుంటుంది. శవాన్ని శ్మశాన వాటికకు తరలించి సంప్రదాయ పద్ధతిలోనే అంత్యక్రియలు పూర్తి చేస్తామని వివరించారు.

కొత్తగా గ్యాస్ ఆధారిత అంత్యక్రియలను మొదలుపెట్టాం. నగరంలోనే రెండెకరాల స్థలంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇదే కాక ఒక నెలలో కొత్త శ్మశాన వాటికలో కూడా అంత్యక్రియలు నిర్వహిస్తారని చెప్పారు.