Crooked road : హైదరాబాద్ చాదర్ ఘాట్ లో కుంగిన రోడ్డు
హైదరాబాద్ ప్రధాన రహదారుల్లో గుంతలు పడటం నగరవాసులను భయాందోళనకు గరి చేస్తోంది. హియాయత్ నగర్ ఘటన మరవకముందే చాదర్ ఘాట్ లో రోడ్డు కుంగింది. రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది.

hole
Crooked road : హైదరాబాద్ ప్రధాన రహదారుల్లో గుంతలు పడటం నగరవాసులను భయాందోళనకు గరి చేస్తోంది. హియాయత్ నగర్ ఘటన మరవకముందే చాదర్ ఘాట్ లో రోడ్డు కుంగింది. రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. దీంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు.
చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ప్రధాన రహదారిపై సుమారు ఒక అడుగు మేర గుంత ఏర్పడింది. స్థానికుులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గుంత చుట్టూ భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. వాటర్ బోర్డుతోపాటు జీహెచ్ ఎంసీ అధికారులు ఘటన స్థలికి చేరుకుని గుంత పడటానికి గల కారణాలను తెలుసుకున్నారు.
గుంత పడిన ప్రాంతాన్ని మరమత్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గుంత పడిన ప్రాంతంలో పక్కనే డ్రైనేజీ 20 ఫీట్ల కింద ఉండటంతో భారీ ప్రమాదం జరిగేదని స్థానికులు చెబుతున్నారు. వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ అధికారుల గుంతను పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు.