Cyber Security Course : డిగ్రీలో కొత్త కోర్సు.. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు

ఫేక్ సర్టిఫికేట్లను అరికట్టేందుకు స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సిస్టం (ఎస్ఏవీఎస్) ను ప్రవేశపెట్టగా, ఇది విజయవంతంగా సేవలందిస్తున్నదని ప్రశించారు. సైబర్ సెక్యూరిటీ విద్యార్థులను సైబర్ యోధులుగా తయారు చేస్తుందని ఆకాంక్షించారు.

Cyber Security Course : డిగ్రీలో కొత్త కోర్సు.. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు

cyber security course

Cyber Security Course – Higher Education : సైబర్ నేరాలను అరికట్టడం, వాటిని నిర్మూలించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యలో కొత్త కోర్సు అందుబాటులోకి తీసుకొచ్చింది. సైబర్ సెక్యూరిటీ పేరుతో రూపొందించిన ఈ కోర్సును హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రితో కలిసి ప్రారంభించారు.

అనంతరం మూల్యాంకన పద్ధతులపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) రూపొందించిన అధ్యయన నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ ఉన్నత విద్యలో సమూలమైన మార్పులు తీసుకురావాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ సెకండియర్ లో సైబర్ సెక్యూరిటీ కొత్త కోర్సును ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు.  30శాతం ప్రజలు ఏదో ఒక సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారని తెలిపారు.

Tomato for skin : చర్మసౌందర్యానికి టొమాటోతో అనేక ప్రయోజనాలు !

ఫేక్ సర్టిఫికేట్లను అరికట్టేందుకు స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సిస్టం (ఎస్ఏవీఎస్) ను ప్రవేశపెట్టగా, ఇది విజయవంతంగా సేవలందిస్తున్నదని ప్రశించారు. సైబర్ సెక్యూరిటీ విద్యార్థులను సైబర్ యోధులుగా తయారు చేస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు వెంకటరమణ, ఎస్.కే మహమూద్, పలు వర్సిటీల వీసీలు విజ్జులత, రవీందర్, గోపాల్ రెడ్డి, పలు వర్సిటీల ఆచార్యులు పాల్గొన్నారు.

కోర్సు ప్రత్యేకతలు
సైబర్ సెక్యూరిటీ కోర్సును డిగ్రీ సెకండియర్ లో నాలుగో సెమిస్టర్ లోని బీఏ, బీకాం, బీఎస్సీ వంటి అన్ని రకాల కోర్సుల విద్యార్థులు పూర్తి చేయాలి. ఇందులో ఇంట్రడక్షన్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ, బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అండ్ సైబర్ లాస్, ఇంట్రడక్షన్ ఆఫ్ సైబర్ క్రైమ్ అండ్ డిజిటల్ ఫోరెన్సెక్స్, సోషల్ నెట్ వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఈకా మర్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ మాడ్యుల్స్ ఉన్నాయి. 100 మార్కులున్న ఈ కోర్సును పూర్తి చేస్తే నాలుగు క్రెడిట్స్ జారీ చేస్తారు. ప్రాక్టికల్స్ కు 30 మార్కులు, థియర్ ఎగ్జామ్ 70 మార్కులకు నిర్వహిస్తారు.