రేవంత్ చేతకానితనంవల్లే కరెంటు కోతలు.. కానీ చిన్న ఉద్యోగులపై ఫత్వాలు జారీ చేస్తున్నారు: దాసోజు శ్రవణ్

Dasoju Sravan: మంత్రి భట్టి విక్రమార్క సంబంధిత శాఖ మంత్రి అని, కరెంటు పోయినందుకు ఆయనను కూడా రేవంత్ సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు.

రేవంత్ చేతకానితనంవల్లే కరెంటు కోతలు.. కానీ చిన్న ఉద్యోగులపై ఫత్వాలు జారీ చేస్తున్నారు: దాసోజు శ్రవణ్

Dasoju Sravan

సమ్మక్క-సారక్క సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అబద్ధమాడారని అన్నారు. 60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ పచ్చి అబద్ధం చెప్పారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వా రాగానే కరెంటు ఇబ్బందులు ఎందుకు మొదలయ్యాయని నిలదీశారు.

సీఎం రేవంత్ రెడ్డి తన చేతకానితనాన్ని, అసమర్థతను సమర్థించుకోవడానికి చిన్న ఉద్యోగులపై ఫత్వాలు జారీ చేస్తున్నారని అన్నారు. మంత్రి భట్టి విక్రమార్క సంబంధిత శాఖ మంత్రి అని, కరెంటు పోయినందుకు ఆయనను కూడా రేవంత్ సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న కామెంట్లపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. 27వ తేదీ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ రెండు గ్యారంటీలు ప్రారంభిస్తారని చెబుతున్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చిందని, అందులో 13 హామీలున్నాయని తెలిపారు.

రాష్ట్రంలో కోటి 24 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పారు. 40 లక్షల మందికే ఉచిత 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటున్నారని తెలిపారు. ప్రజా పాలన కింద ఎంత మంది నుంచి దరఖాస్తులు అందాయో చెప్పాలని నిలదీశారు.

తెల్లరేషన్ కార్డుల కోసం కొత్తగా ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో చెప్పాలని అన్నారు. 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉంటే 40 లక్షల మందికే ఈ పథకం వర్తిస్తుందని అంటున్నారని విమర్శించారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలని అన్నారు. అందరికీ 200 యూనిట్లలోపు విద్యుత్ ను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read Also: చంద్రబాబు ఏది పడేస్తే దానికి తృప్తిపడటం పవన్‌కు అలవాటైంది : సజ్జల రామకృష్ణారెడ్డి