తెలంగాణలో కరోనా : నిన్న మర్కజ్..నేడు దేవ్ బంద్..రేపు ?

  • Published By: madhu ,Published On : April 14, 2020 / 04:55 AM IST
తెలంగాణలో కరోనా : నిన్న మర్కజ్..నేడు దేవ్ బంద్..రేపు ?

Updated On : April 14, 2020 / 4:55 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అనుకున్న క్రమంలో..అందరిలో కలవరం మొదలైంది. మరలా వైరస్ రాకాసి కోరలు చాస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో కేసుల సంఖ్య క్రమక్రమంగా ఎక్కువవుతున్నాయి. అయితే..ప్రారంభంలో విదేశాల నుంచి వచ్చిన వారిలో వైరస్ లక్షణాలు కనిపించాయి. అనంతరం వీరి నుంచి ఇతరులకు సోకాయి.

ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కేసులు పెరగలేదు. కానీ అనూహ్యంగా ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సదస్సులో పాల్గొని వచ్చిన వారికి..వీరి నుంచి ఇతరులకు వ్యాధి సోకింది. దీంతో అనూహ్యంగా కేసులు అధికమయ్యాయి. కేసులు ఇక నమోదు కావని అనుకున్న వైద్యులు, పోలీసులు, అధికారులకు పెను సవాల్ గా మారింది. వీరిని వెతికి పట్టుకుని క్వారంటైన్ కు తరలించారు. వీరందరికీ చికిత్స అందించారు. మరణాలు అధికంగా ఉండకుండా ప్రయత్నించారు. కానీ హమ్మయ్య అనుకొనే లోపే మరో ఘటన తెరమీదకు వచ్చింది. 

ఉత్తర్‌ప్రదేశ్‌లో ముస్లిం ఆధ్యాత్మిక ఉద్యమానికి కేంద్రంగా ఉన్న దేవ్‌బంద్‌కి వెళ్లిన వారిలో కరోనా లక్షణాలు వెలుగు చూశాయి. వారికి మర్కజ్‌తో లింకులు బయటపడటంతో ఎలా ఎదుర్కొవాలనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. దేవ్ బంద్ కు ఎవరెవరు వెళ్లారు ? ఎప్పుడు రాష్ట్రానికి వచ్చారు ? వీరు ఎవరెవరిని కలిశారు ? తదితర వాటిపై అధికారులు దృష్టి పెట్టారు. నిర్మల్ ఇలాంటి వారిని ముగ్గురిని గుర్తించడం గమనార్హం. 

మార్చి ఫస్ట్ వీక్ లో నిర్మల్ నుంచి దేవ్ బంద్ కి దాదాపు 10 మంది వెళ్లినట్లు గుర్తించారు. దీనికంటే ముందు..మర్కజ్ ఘటన వెలుగులోకి రావడంతో..వీరంతా భయభ్రాంతులకు గురయ్యారు. అరెస్టు చేస్తారన్న భయంతో ఆ విషయాన్ని దాచి పెట్టారు. ఢిల్లీలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) నుంచి రాష్ట్ర పోలీసులకు నిర్మల్‌ నుంచి దేవ్‌బంద్‌కి వెళ్లిన వారు మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొన్నారన్న సమాచారం వచ్చింది. దీంతో వీరిలో ముగ్గురికి పరీక్షలు చేయగా, ఒకరికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. దీంతో మిగిలిన వారిని క్వారంటైన్‌కు తరలించారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సహ్రాన్ పూర్ జిల్లాలో దేవ్ బందీ ఉంది. ఢిల్లీకి 150 కి.మీటర్ల దూరంలో ఉంది. సున్నీ ఇస్లాం ఉద్యమానికి పుట్టినిల్లుగా చెప్పవచ్చు. సున్నీ ఇస్లాం మతప్రచారం కోసం దారుల్ ఉలూమ్ దేవ్ బందీ అనే అరబిక్ యూనివర్సిటీ మౌలానా మహ్మద్ ఖాసీం నానోతావీ ప్రారంభించారు. దీనినే దేవ్ బందీ అని పిలుస్తారు. తర్వాత దేశమంతా విస్తరించింది. ప్రపంచంలోని ముస్లిం దేశాల విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు.