విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఎంట్రెన్స్ టెస్టు లేకుండానే బీసీ గురుకులాల్లో ప్రవేశాలు..
తెలంగాణ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులంలో ఇంటర్, డిగ్రీ అడ్మిషన్ల పై ఆ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది.

students
Telangana BC Gurukul Admissions: తెలంగాణ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులంలో ఇంటర్, డిగ్రీ అడ్మిషన్ల పై ఆ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రతీయేటా గురుకులాల్లో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తుండగా.. ఆ విధానాన్ని రద్దు చేసింది.
Also Read: Tirumala: తిరుమలకు వెళ్లే తెలంగాణ భక్తులకు గుడ్ న్యూస్.. ఇకనుంచి వాటికోసం ప్రత్యేక వెబ్ సైట్
2025-26 విద్యా సంవత్సరం నుంచి ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండా పదో తరగతిలో వచ్చిన మార్కులు, మెరిట్ ఆధారంగా ఇంటర్ అడ్మీషన్లు, ఇంటర్ లో వచ్చిన మార్కులు, మెరిట్ ఆధారంగా డిగ్రీ అడ్మిషన్లు ఇవ్వాలని సొసైటీ నిర్ణయించింది. ఈ విధానం ద్వారానే త్వరలో ఇంటర్, డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చేందుకు గురుకుల సొసైటీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఎస్సీ గురుకుల సొసైటీలో ఇంటర్ ప్రవేశాలకు చేపట్టిన పైలట్ ప్రాజెక్టు మంచి ఫలితాలను ఇస్తోంది. దీంతో ఈ విధానాన్ని అన్ని గురుకులాల్లో అమలు చేయాలని సొసైటీలు నిర్ణయించాయి.
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 261 ఇంటర్ కాలేజీలు, 33 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇందులో ఇంటర్, డిగ్రీ కలిపి మొత్తం 25వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.