జితేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు.. శ్రీనివాస్ గౌడ్ గురించి ఏమన్నారంటే?

జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మాజీ మంత్రి, బీజేపీ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు.

జితేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు.. శ్రీనివాస్ గౌడ్ గురించి ఏమన్నారంటే?

DK Aruna

DK Aruna : మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీని వీడి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మాజీ మంత్రి, బీజేపీ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. జితేందర్ రెడ్డికి బీజేపీ పెద్దెత్తున గుర్తింపు ఇచ్చింది, ఆయనకు పార్టీలో అనేక అవకాశాలు కల్పించింది. బీజేపీలో ఎక్కడా ఆయన గౌరవం తగ్గలేదు. నియోజకవర్గంలో ఎలాంటి పరిచయం లేకపోయినా జితేందర్ రెడ్డి కుమారుడు కాబట్టి మిథున్ రెడ్డికి మహబూబ్ నగర్ అసెంబ్లీ టికెట్ ను బీజేపీ కేటాయించిందని డీకే అరుణ గుర్తు చేశారు. మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, ఇతర ముఖ్యనేతలు బీజేపీని వీడటానికి కారణం ఎవరు? ఏ సిద్ధాంతానికి కట్టుబడి జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాడో చెప్పాలని డీకే అరుణ ప్రశ్నించారు.

Also Read : ఖమ్మం పార్లమెంట్ బరిలో టీడీపీ? ససేమీరా అంటున్న బీజేపీ సీనియర్లు!

మరోవైపు మాజీ మంత్రి, మహబూబ్ నగర్ బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ బీజేపీలో చేరుతారంటూ వస్తున్న వార్తలను డీకే అరుణ ఖండించారు. శ్రీనివాస్ గౌడ్ బీజేపీలో చేరిక అంతా పుకార్లేనని  అన్నారు. బీజేపీ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ అభ్యర్థిగా ఉన్న తనను సంప్రదించకుండా ఆయన్ను బీజేపీలో చేర్చుకుంటారా? అంటూ డీకే అరుణ ప్రశ్నించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ గెలుస్తుందని ప్రతిపక్షాలు కుట్రలో భాగంగా ఇలాంటి వస్తున్నాయని అన్నారు. ఆ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, మేము ఎవరము ఎవరిని రమ్మని అడగలేదని డీకే అరుణ అన్నారు.