దేశ రక్షణ విషయంలో రాజీపడొద్దు…ఒక్కతాటిపై నిలవాలి : సీఎం కేసీఆర్  

  • Published By: bheemraj ,Published On : June 17, 2020 / 05:12 PM IST
దేశ రక్షణ విషయంలో రాజీపడొద్దు…ఒక్కతాటిపై నిలవాలి : సీఎం కేసీఆర్  

Updated On : June 17, 2020 / 5:12 PM IST

దేశ రక్షణ విషయంలో రాజీపడొద్దని.. దేశమంతా ఒక్కతాటిపై నిలవాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తారని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భారత్‌-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణ అంశాన్ని సీఎం కేసీఆర్‌ ప్రస్తావించారు. చైనా గానీ, మరే దేశంగానీ భారత్‌ సార్వభౌమత్వం విషయంలో జోక్యం చేసుకుంటే తప్పక ప్రతిఘటించాలని అన్నారు. తగిన సమాధానం చెప్పాలన్నారు. 

దేశ రక్షణ విషయంలో ఎవరూ రాజకీయం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. దేశమంతా ఒక్కతాటిపై నిలబడాల్సిన సమయమని అభిప్రాయపడ్డారు. లడఖ్‌ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో చనిపోయిన సైనికులకు వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభంలో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రులు  రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. 

Read: బావిలో శవాలుగా తేలిన చిన్నారులు..గిరిజన గ్రామంలో విషాదం