ఆగస్టు 24 నుంచి దోస్త్ అడ్మీషన్స్…ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్

  • Published By: bheemraj ,Published On : August 20, 2020 / 11:01 PM IST
ఆగస్టు 24 నుంచి దోస్త్ అడ్మీషన్స్…ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్

Updated On : August 21, 2020 / 6:24 AM IST

తెలంగాణ‌లోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్ర‌వేశాల కోసం రాష్ట్ర ఉన్న‌త విద్యా మండలి గురువారం (ఆగస్టు 20, 2020) దోస్త్ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఆగ‌స్టు 24 నుంచి సెప్టెంబ‌ర్ 7వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ చేప‌ట్ట‌నున్నారు. రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌కు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది.

రిజిష్ట్రేష‌న్ చేసుకున్న విద్యార్థులు ఆగ‌స్టు 29 నుంచి సెప్టెంబ‌ర్ 8వ తేదీ వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబ‌ర్ 16న మొద‌టి విడత అడ్మిష‌న్ల‌కు సంబంధించి సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్ 17 నుంచి 22వ తేదీ మ‌ధ్య‌లో ఆన్‌లైన్‌లోనే సెల్ఫ్ రిపోర్టు ఇవ్వాలి.