Dr CH Bhadra Reddy : డాక్టర్ సిహెచ్ భద్ర రెడ్డికి ఇండియన్ ఎచివర్స్ అవార్డు

మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ సి.హెచ్.భద్ర రెడ్డికి ఇండియన్ ఎచివర్స్ అవార్డు లభించింది.

Dr CH Bhadra Reddy : డాక్టర్ సిహెచ్ భద్ర రెడ్డికి ఇండియన్ ఎచివర్స్ అవార్డు

Dr CH Bhadra Reddy received Indian Achievers Award

వైద్య, విద్యారంగంలో చేస్తున్న సేవలకు గాను మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ సి.హెచ్.భద్ర రెడ్డికి ఇండియన్ ఎచివర్స్ అవార్డును అందుకున్నారు. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు విద్యనందించ‌డంతో పాటు మల్లారెడ్డి హెల్త్ సిటీ ద్వారా ఎంతో మందికి వైద్య సేవ‌లు అందిస్తూ ఎన‌లేని సేవ‌లు చేస్తున్నారు భద్ర రెడ్డి.

ఈ క్ర‌మంలో ఇంటర్ ఆక్టివ్ ఫారం ఆన్ ఇండియన్ ఎకానమీ ద్వారా ఈనెల 28న న్యూఢిల్లీలోని హయత్ రెజెన్సీ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న‌తో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ్ ఖన్నా, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సత్పాల్ సింగ్‌ల‌తో పాటు ప‌లువురు సినీ, క్రీడా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌కు ఈ అవార్డును అంద‌జేయడం జ‌రిగింది.