Durgam cheruvu: దుర్గం చెరువులోకి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. పోలీసుల విచారణలో వెలుగులోకి కీలక విషయాలు

రాయదుర్గం పోలీసులు ఐటీ కంపెనీలో విచారించగా 24వ తేదీ రాత్రి 8:30గంటల సమయంలో బాలాజీ బయటికి వెళ్లినట్లు తెలిపారు. సీసీ కెమెరాల్లో మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ మీదుగా

Durgam cheruvu: దుర్గం చెరువులోకి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. పోలీసుల విచారణలో వెలుగులోకి కీలక విషయాలు

Durgam Cheruvu

Software Employee Suicide : హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువులో దూకి సాప్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు విచారణ చేపట్టగా.. ప్రేమ వ్యవహారం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మాదాపూర్ నాలెడ్జ్ సిటీలోని సాప్ట్ వేర్ కంపెనీలో ముషీరాబాద్ కు చెందిన బాలాజీ(25) ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రోజూమాదిరిగానే ఈనెల 24న ఉదయం ఆఫీస్ కు వెళ్లిన బాలాజీ.. అర్ధరాత్రి అయిన ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ఆఫ్ రావడంతో, బాలాజీ స్నేహితులకు ఫోన్ చేశారు. అయినా అతని ఆచూకీ లభించకపోవడంతో ఈనెల 25వ తేదిన రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు.

Also Read : Maharashtra: నవీ ముంబైలో విషాదం.. కుప్పకూలిన మూడంతస్తుల భవనం..

రాయదుర్గం పోలీసులు ఐటీ కంపెనీలో విచారించగా 24వ తేదీ రాత్రి 8:30గంటల సమయంలో బాలాజీ బయటికి వెళ్లినట్లు తెలిపారు. సీసీ కెమెరాల్లో మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ మీదుగా కిందికి దిగినట్లు పోలీసులు గుర్తించారు. దుర్గం చెరువులో గాలిస్తుండగా శుక్రవారం సాయంత్రం నీటిలో బాలాజీ మృతదేహం లభ్యమైంది. మెడలో ఉన్న ఐడీ కార్డు ఆధారంగా బాలాజీగా పోలీసులు గుర్తించారు.

Also Read : Chiranjeevi : మెగాస్టార్ ఎత్తుకున్న ఈ ఇద్దరు పిల్లలు ఎవరో తెలుసా? ఇప్పుడు ఇద్దరూ హీరోలే..

కొంతకాలంగా బాలాజీ ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. యువతి పెళ్లికోసం ఒత్తిడి చేయగా ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు చెప్పలేక బాలాజీ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమే బాలాజీ ఆత్మహత్యకు కారణంగా పోలీసుల ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించిన రాయదుర్గం పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.