Actor Navdeep : సినీ హీరో నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో షాక్.. పిటిషన్ కొట్టివేత

నవదీప్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అయితే, అతన్ని అరెస్టు చేయొద్దని, 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు పోలీసులకు సూచించింది.

Actor Navdeep : సినీ హీరో నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో షాక్.. పిటిషన్ కొట్టివేత

Navadeep

Telanagana High Court : డ్రగ్స్ కేసులో సినీ హీరో నవదీప్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. నవదీప్ పై గతంలోనూ డ్రగ్స్ కేసులు ఉన్నాయని హైకోర్టుకు పోలీసులు తెలిపారు. అయితే, గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేడని అతని అడ్వకేట్ సిద్దార్థ్ కోర్టుకు వివరించారు. గతంలోనూ దర్యాప్తు సంస్థల ముందు నవదీప్ హాజరయ్యారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు వివరించారు. అయితే, కోర్టు నవదీప్ పిటిషన్ కొట్టివేసింది.  అయితే, ఈ కేసులో 41ఏ కింద నోటీస్ ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. నవదీప్‌ను అరెస్టు చెయ్యద్దని, 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
Read Also: Navdeep : నవదీప్‌కు డ్రగ్స్ ముఠాతో లింకులు, తరుచుగా హైదరాబాద్‌లో పార్టీలు.. డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

మాదాపూర్‌లో ప్రెస్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పోలీసులు ఇటీవల కొందరిని అరెస్టు చేశారు. వీరిని విచారణ చేయగా.. రామచంద్ర అనే వ్యక్తి నవదీప్ తనతో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పాడు. దీంతో యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు నవదీప్‌కు గతంలో నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని సూచించారు. ఈ కేసులో నవదీప్ ఏ29గా పేర్కొన్నారు. నోటీసులకు స్పందించి విచారణకు వస్తానని నవదీప్ చెప్పినప్పటికీ.. ఆ తరువాత నవదీప్ హైకోర్టును ఆశ్రయించారు.

 

Read Also:  Navdeep : డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు బిగ్ రిలీఫ్

ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ నవదీప్ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. దీంతో ఈనెల 19వరకు నవదీప్‌ను అరెస్టు చేయొద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో మరోసారి హైకోర్టులో నవదీప్ కేసుపై విచారణ జరిగింది. దీంతో నవదీప్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అయితే, అతన్ని అరెస్టు చేయొద్దని, 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు పోలీసులకు సూచించింది.