Navdeep : నవదీప్‌కు డ్రగ్స్ ముఠాతో లింకులు, తరుచుగా హైదరాబాద్‌లో పార్టీలు.. డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

వారంతా హైదరాబాద్ లో తరుచూ డ్రగ్స్ పార్టీలు నిర్వహించే వారని, వైజాగ్ కు చెందిన రామ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి.. Navdeep - Madhapur Drugs Case

Navdeep : నవదీప్‌కు డ్రగ్స్ ముఠాతో లింకులు, తరుచుగా హైదరాబాద్‌లో పార్టీలు.. డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

Navdeep - Madhapur Drugs Case

Navdeep – Madhapur Drugs Case : తెలంగాణలో సంచలనం రేపిన మాదాపూర్ డ్రగ్స్ కేసు నిందితుల రిమాండ్ రిపోర్టు 10టీవీ చేతికి చిక్కింది. ఈ కేసులో 8మంది నిందితులను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఈ నెల 27 వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు నిందితులను నాంపల్లి కోర్టు నుంచి జైలుకి తరలించారు.

రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు చేర్చారు పోలీసులు. ఆగస్టు 31న నిందితులు వెంకట్, బాలాజీ, మురళిని అరెస్ట్ చేశామన్నారు. వారు ఇచ్చిన సమాచారంతో సెప్టెంబర్ 13న మరో 8మంది డ్రగ్స్ నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. మెహిదీపట్నం బస్టాప్ దగ్గర ముగ్గురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు ఎస్టీపీ పిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు.

Also Read..Navdeep : డ్రగ్స్ కేసులో నవదీప్..! తాను కాదంటున్న టాలీవుడ్ హీరో నవదీప్

విచారణలో నిందితులు కీలక సమాచారం చెప్పారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారంతో టాలీవుడ్ హీరో నవదీప్ కి డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నాయని గుర్తించామన్నారు. హీరో నవదీప్ తో పాటు 17మంది పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారంతా హైదరాబాద్ లో తరుచూ డ్రగ్స్ పార్టీలు నిర్వహించే వారని, వైజాగ్ కు చెందిన రామ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో పార్టీలు చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఏ-5 నుంచి ఏ-16 వరకు నిందితులపై ఎన్డీపీఎస్(NDPS) యాక్ట్ 1985తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Also Read..Baby Movie : బేబీ సినిమాపై సీపీ తీవ్ర ఆగ్రహం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీవీ ఆనంద్, ఇక ప్రతి సినిమాపైనా నిఘా

డ్రగ్స్ కేసులో దర్యాఫ్తు ముమ్మరం..
మాదాపూర్ డ్రగ్స్ కేసులో యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో 8మంది నిందితులను అరెస్ట్ చేసి వారందరినీ జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. నిన్న అరెస్ట్ చేసిన ఐదుగురితో పాటు గతంలో అరెస్ట్ చేసిన ముగ్గురిని కూడా ఇవాళ మరోసారి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఈ నెల 27 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అరెస్ట్ అయిన 8మంది నిందితులకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు చేర్చారు.

ఏ-29గా హీరో నవదీప్..
రిమాండ్ రిపోర్టులో యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు చాలా స్పష్టంగా కొన్ని కీలక అంశాలు పొందుపరిచారు. ఈ కేసులో హీరో నవదీప్ ని ఏ-29 నిందితుడిగా పోలీసులు చేర్చారు. నవదీప్ కు డ్రగ్స్ ముఠాలతో లింకులు ఉన్నట్లు పోలీసులు స్పష్టంగా పేర్కోన్నారు. ఏ-29 నిందితుడిగా ఉన్న నవదీప్ ను విచారించాలని యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు నవదీప్ కు నోటీసులు కూడా జారీ చేశారు. విచారణకు వస్తాను అని చెప్పిన నవదీప్ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడని, పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. నవదీప్ అందుబాటులో లేడని తెలిపారు.