Baby Movie : బేబీ సినిమాపై సీపీ తీవ్ర ఆగ్రహం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీవీ ఆనంద్, ఇక ప్రతి సినిమాపైనా నిఘా

ఇకపై ప్రతి సినిమాపై ఫోకస్ పెడతాము. అలాంటి సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదు. Baby Movie - CP CV Anand

Baby Movie : బేబీ సినిమాపై సీపీ తీవ్ర ఆగ్రహం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీవీ ఆనంద్, ఇక ప్రతి సినిమాపైనా నిఘా

Baby Movie - CP CV Anand (Photo : Google)

Baby Movie – CP CV Anand : చిన్న సినిమాగా విడుదలైన బేబీ చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ కొట్టింది. ఈ సినిమా రికార్డు కలెక్షన్లు రాబట్టింది. తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీకి భారీగానే లాభాలు వచ్చాయి. అయితే, బేబీ సినిమా ఎంత పాపులర్ అయ్యిందో అంతే రేంజ్ లో వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బేబీ సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారాయన. దానికి కారణం ఆ సినిమాలోని సీన్ లే.

డ్రగ్స్ కల్చర్ ను ప్రోత్సహించే విధంగా బేబీ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని సీపీ సీవీ ఆనంద్ మండిపడ్డారు. డ్రగ్స్‌ను ఏ విధంగా ఉపయోగించాలనే దృశ్యాలను అందులో చూపించారన్నారు. మాదాపూర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో పోలీసులు రైడ్ చేసిన సమయంలో.. అక్కడ జరుగుతున్న తంతు చూసి షాక్ అయ్యారని, బేబీ సినిమాలో ఏ విధంగా సన్నివేశాలు ఉన్నాయో అవన్నీ అక్కడ కనిపించాయని సీపీ చెప్పారు. బేబీ సినిమా చూసే నిందితులు ఆ విధంగా పార్టీ చేసుకున్నారని చెప్పడం మాకు షాక్ గురి చేసిందన్నారు.

Also Read..Dancer Suspicious Death : తమిళనాడులో తిరుపతికి చెందిన మహిళా డ్యాన్సర్ అనుమానాస్పద మృతి

”సినిమాలో అలాంటి సన్నివేశాలు పెట్టి కనీసం కాషన్(హెచ్చరిక) వెయ్యకుండా డైరెక్ట్ గా ప్లే చేసింది చిత్ర యూనిట్. మళ్లీ మేము హెచ్చరిస్తేనే కాషన్ లైన్ వేశారు. బేబీ సినిమా ప్రొడ్యూసర్ కి నోటీసులు ఇస్తాము. అలాంటి దృశ్యాలను చిత్రీకరించొద్దని సినీ పరిశ్రమకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపై ప్రతి సినిమాపై ఫోకస్ పెడతాము. అలాంటి సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదు. బేబీ సినిమాలో అభ్యంతరకర సీన్లు ఉన్నాయి. ఈ విషయమై బేబీ సినిమా టీంకు నోటీసులు జారీ చేస్తాము” అని సీపీ వెల్లడించారు.

ఈ వివాదంపై బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ నీలం స్పందించారు. ”నిన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నుండి ఫోన్ వచ్చింది. బేబీ సినిమాలో ఒక సన్నివేశం గురించి ఆరా తీశారు. అలాంటి సీన్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరణ అడిగారు. కథలో భాగంగా పెట్టాల్సి వచ్చిందని చెప్పాము. సేమ్ సీన్స్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో బయటకు వచ్చాయని చెప్పారు. సమాజానికి మంచి మెసేజ్ ఉండేలా సినిమాలు తియ్యాలని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి మా ద్వారా చెప్పమన్నారు. ఈరోజు అడ్వైజరీ నోటీస్ ఇచ్చారు” డైరెక్టర్ సాయి రాజేష్ వెల్లడించారు.