Drunk And Drive : వైన్ షాప్ పక్కనే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్.. రోడ్డుపై పడుకుని మందుబాబులు నిరసన

జోగులాంబ గద్వాల జిల్లాలో తాగుబోతులు గొడవకు దిగారు. వైన్‌షాపు పక్కనే డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Drunk And Drive : వైన్ షాప్ పక్కనే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్.. రోడ్డుపై పడుకుని మందుబాబులు నిరసన

New Project

Updated On : December 7, 2021 / 9:53 PM IST

alcoholics Protest on the road : జోగులాంబ గద్వాల జిల్లాలో తాగుబోతులు గొడవకు దిగారు. వైన్‌షాపు పక్కనే డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పుల్లూరు టోల్‌ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

ఉండవెల్లి పోలీసులు టోల్‌ప్లాజా దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టారు. వాహనదారులకు పరీక్షలు నిర్వహించారు. అయితే పక్కనే ఉన్న వైన్‌షాపు నుంచి అక్కడకు చేరుకున్న మందుబాబులు గొడవకు దిగారు.

Corona Cases : ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు, ఇద్దరు మృతి

రోడ్డుపై పడుకుని హడావుడి చేశారు. వాహనాల డ్రైవర్లతో గొడవకు దిగారు. దీంతో పోలీసులు మందుబాబులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.