Madhapur Accident : మారని తాగుబోతులు.. మాదాపూర్‌‌లో మరో ఆక్సిడెంట్

మాదాపూర్ లో కారు బీభత్సానికి ముగ్గురు యువకులు ఆసుపత్రి పాలయ్యారు. మద్యం మత్తులో కారును యువకుడు వేగంగా నడపడమే ఇందుకు కారణం. మాదాపూర్‌లో...

Madhapur Accident : మారని తాగుబోతులు.. మాదాపూర్‌‌లో మరో ఆక్సిడెంట్

Madhapur

Updated On : April 24, 2022 / 1:07 PM IST

Drunk Driver : తాగుబోతులు మారడం లేదు. కిక్కెచ్చే వరకు ఫుల్ గా మందు సేవించి రోడ్లపైకి వాహనాలతో వచ్చేస్తున్నారు. రయ్యిరయ్యిమంటూ దూసుకెళుతూ.. ప్రమాదాలకు కారణమౌతున్నారు. ఈ ప్రమాదాల్లో వారు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా.. ఇతరుల ప్రాణాలను బలిగొంటున్నారు. వీటికి చెక్ పెట్టడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఘటనలు మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఒక చోట ఆక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కారులో బెలూన్స్ ఓపెన్ కావడంతో వారు స్వల్ప గాయాలతో బయటపడుతున్నా.. ఇతరులు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరిగిన సంగతి తెలిసిందే.

Read More : Warangal : ఘనంగా కూతురి పెళ్లి చేసిన తండ్రి.. అంతలోనే విషాదం

లెటెస్ట్ గా మరొక ఆక్సిడెంట్ చోటు చేసుకుంది. మాదాపూర్ లో కారు బీభత్సానికి ముగ్గురు యువకులు ఆసుపత్రి పాలయ్యారు. మద్యం మత్తులో కారును యువకుడు వేగంగా నడపడమే ఇందుకు కారణం. మాదాపూర్‌లో మద్యం మత్తులో ఉన్న యువకుడు కారును వేగంగా నడిపాడు. ఎలా నడుపుతున్నాడో అతనికే అర్థం కాలేదు. ఏకంగా ఓ బైక్ ను ఢీ కొట్టాడు. బైక్ వెళుతున్న ముగ్గురు యువకులు కిందపడిపోయారు. బైక్ ను ఢీ కొట్టిన తర్వాత కారును ఆపలేదు. ఓ అపార్ట్ మెంట్ వైపు వేగంగా దూసుకెళ్లాడు. గేట్ ను ఢీకొట్టి.. లోనికి దూసుకెళ్లింది. అక్కడ పిల్లర్ ను ఢీకొట్టి ఆగిపోయింది. కారులో ఉన్న బెలూన్స్ ఓపెన్ కావడంతో మద్యం మత్తులో ఉన్న యువకుడికి ఏమి కాలేదు. ఈ ఘటనలో అపార్ట్‌మెంట్‌ గేటు ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కారు నడిపిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.