Wine Shops Closed : మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ లో రేపు వైన్స్ బంద్.. ఎప్పటి వరకంటే
Wine Shops Closed : హైదరాబాద్ నగరంలోని మందు బాబులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు పోలీసులు. రేపు వైన్స్ బంద్ అని ప్రకటించారు.
dry day in hyderabad wine shops and bars closed on march 27 due to sri rama navami says cp sajjanar
Wine Shops Closed : భాగ్యనగరంలోని మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. మార్చి 27, శుక్రవారం నగరంలోని వైన్ షాపులు బంద్ చేయనున్నట్లు వెల్లడించారు. కారణం శ్రీరామనవమి సందర్భంగా మార్చి 27న నగరంలో డ్రై డే పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో.. జంటనగరాల పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
మార్చి 27 శ్రీరామనవమి నేపథ్యంలో.. నగరమంతటా.. అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు. ఈ క్రమంలో ప్రశాంత వాతావరణంలో పండుగ జరిగేలా చూసేందుకు గాను పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో మార్చి 27, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నగరంలోని మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. వైన్స్, బార్లు, కల్లు దుకాణాలతో పాటు.. స్టార్ హోటళ్లలోని బార్లలో కూడా మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు. అమ్మకాలు జరపవద్దని సూచించారు.
మద్యం అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ ‘డ్రై డే’ నోటిఫికేషన్ జారీ చేసినట్లు సీపీ సి.వి. ఆనంద్ వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు తెరిచినా.. అమ్మినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు వైన్స్ బంద్ నేపథ్యంలో ఇప్పటికే మందుబాబులు దుకాణాల వద్ద బారులు తీరారు.
