బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

Gudem Mahipal Reddy: దాని ఆధారంగానే ఈడీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

Gudem Mahipal Reddy

Updated On : June 21, 2024 / 4:17 PM IST

పటాన్‌చెరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ అధికారులు ఇవాళ తెల్లవారుజామునుంచే ఏక కాలంలో మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. మొత్తం ఎనిమిది చోట్ల దాడులు చేశారు.

ఈ అంశం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు సోదరులు మైనింగ్ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. గతంలో ఒక కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో కేసు నమోదైంది. దాని ఆధారంగానే ఈడీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.

పటాన్‌చెరులోని మూడు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే, నిజాంపేటలోని వారి బంధువుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నిజాంపేటలో అల్లుడి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల మహిపాల్ రెడ్డి అల్లుడు మూడు కోట్ల రూపాయల విలువైన కారు కొన్నట్టు సమాచారం. ఇప్పటివరకు జరిగిన సోదాల్లో భారీ నగదు, పలు డాక్యుమెంట్లను ఈడీ గుర్తించింది.

Also Read: పాడైపోయిన మటన్‌తో బిర్యానీ.. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌పై కేసు