ED raids in TS private medical colleges
ED raids in TS private medical colleges : తెలంగాణ (Telangana) లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో (Private Medical Colleges)ఈడీ (ED)అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ (Hyderabad)తో పాటు 15 ప్రాంతాల్లో 11 బృందాలుగా విడిపోయి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా కామినేని గ్రూప్ కార్యాలపై కూడా దాడులు నిర్వహస్తోంది ఈడీ. హైదరాబాద్, మహబూబ్ నగర్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కామినేని amineni Medical College), ఎస్వీఎస్ (SVS Medical College), ప్రతిమ(Pratima)తో పాటు ఆరు మెడికల్ కాలేజీల్లో ఈ సోదాలు నిర్వస్తున్నారు.
Minister KTR : ఎన్నికల్లో పైసలు ఇవ్వా,మందు పోయా,మీరు కోరుకుంటే సిరిసిల్లో ఉంటా : కేటీఆర్
బుధవారం (జూన్ 21,2023)ఉదయం నుంచి కొనసాగుతున్న ఈ సోదాలు కామినేని గ్రూప్ చైర్మన్, ఎండీ నివాసాల్లోను, ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ, మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ, ప్రతిమా కార్పొరేట్ కార్యాలయాల్లో జరుగుతున్నాయి. అలా తెలంగాణలో మొత్తం 15 చోట్ల ఏకకాలంలో జరుగుతున్నాయి. ప్రతిమా గ్రూప్‌కి చెందిన ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్, బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసు నుంచి 11 బృందాలుగా అధికారులు సీఆర్‌పీఎఫ్ బలగాలతో సహా బయలుదేరారు. హైదరాబాద్ నగరంతో పాటు మహబూబ్‌నగర్ (Mahbubnagar),నల్లగొండ(Nallagonda), రంగారెడ్డి(Rangareddy),మేడ్చల్ ( Medchal)జిల్లాల్లో ఈడీ రైడ్స్ (ED raids)జరుతున్నాయి.
Telangana Congress : కోమటిరెడ్డి వెంకట రెడ్డితో కలిసి జూపల్లి ఇంటికి రేవంత్ రెడ్డి
కాగా ముంబైలో BMC కేంద్రంగా జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా ఈడి సోదాలు (ED raids)నిర్వహిస్తోంది. కోవిడ్ (Covid-19) సమయంలో హైదరాబాద్ హాస్పిటల్స్ నుండి ముంబై BMC కు మెడికల్ కిట్స్ (Medical kits)సప్లై అయిన క్రమంలో జరిగిన అక్రమాలు ఈ సోదాలకు కారణంగా తెలుస్తోంది. భారీగా నిధులు మళ్లింపు జరిగినట్టు ఈడి అభియోగంతో ఈ దాడులు జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీల్లో భారీగ అవకతవకలు జరిగాయని మరి ముఖ్యంగా ఫీజుల వసూళ్ల విషయంలో అక్రమాలు జరిగాయని తెలుస్తోంది. హైదరాబాద్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన సంస్థలు రూ.12వేల కోట్ల స్కామ్ లో ఇరుక్కున్నట్లుగా తెలుస్తోంది.