Telangana Congress : కోమటిరెడ్డి వెంకట రెడ్డితో కలిసి జూపల్లి ఇంటికి రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఎన్నికలు  సమీపిస్తున్న క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఓ పక్క గెలుపు కోసం మరోపక్క నేతల చేరికలపై ఫోకస్ పెంచారు.

Telangana Congress : కోమటిరెడ్డి వెంకట రెడ్డితో కలిసి జూపల్లి ఇంటికి రేవంత్ రెడ్డి

Revanth Reddy, Komatireddy Meets Jupalli

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఎన్నికలు  సమీపిస్తున్న క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఓ పక్క గెలుపు కోసం మరోపక్క నేతల చేరికలపై ఫోకస్ పెంచారు. ఒకప్పుడు ఉప్పు,నిప్పుగా ఉన్న నేతలు కూడా కలిసిపోయి పనిచేస్తున్నారు. మరి ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి కలిసి ఒకేచోట కనిపించటమే కాదు ఇద్దరు కలిసి జూపల్లి కృష్ణారావు,పొంగులేటి ఇళ్లకు వెళ్లి మరీ వారిని పార్టీలోకి చేర్చుకోవటానికి చర్చలు జరుపుతున్నారు. రేవంత్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లటం ఆసక్తికరంగా మారింది. కోమటిరెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఇద్దరు చర్చించుకున్నారు. ఆ తరువాత ఇద్దరు కలిసి జూపల్లి కృష్ణారావు ఇంటికెళ్లి పార్టీలోకి చేర్చుకోనున్నారు. దీని కోసం ఇప్పటికే జూపల్లి ఇంటికి చేరుకున్నారు.అనంతరం ముగ్గురు చర్చించుకుని పొంగులేటి ఇంటికి వెళ్లనున్నారు.

Revanth Reddy: పొంగులేటి, జూపల్లితో భేటీకానున్న రేవంత్.. కాంగ్రెస్‌లో చేరిక, పలు అంశాలపై చర్చ

కాగా చేరికల్లో భాగంగా కోమటిరెడ్డి వెంటకరెడ్డి మద్దతుతో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కోదాడకు చెందిన శశిధర్ రెడ్డిని పార్టీలో చేర్చుకునే పనిలో ఉన్నారు రేవంత్ రెడ్డి. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తంచేస్తున్నారు. నాతో సంప్రదించకుండా వారిని ఎలా పార్టీలోకి తీసుకుంటారు అంటూ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

కాగా..తెలంగాణ కాంగ్రెస్ అంటేనే అంతర్గత విభేధాలతో కొట్టుమిడుతుంటుంది. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరటం అతి తక్కువ కాలంలోనే సీనియర్ నేతలను కాదని అధిష్టానం అతనికే పీసీపీ చీఫ్ పదవి కట్టబెట్టటంతో కోమటిరెడ్డి బ్రదర్స్ కస్సుమన్నారు. రేవంత్ తో ఏమాత్రం కలిసి పనిచేయకపోటం..విమర్శలు చేయటంతో తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ గా మారింది. ఈక్రమంలో వీరిలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. వెంకట రెడ్డి కొంతకాలంలో అసంతృప్తిగా ఉన్నా ఆ తరువాత రేవంత్ తో కలిసి పనిచేయటానికి ఆసక్తి చూపించారు.

ఈ పరిణామాలన్నీ కర్ణాటక ఎన్నికల తరువాత మరింతగా ఊపందుకున్నాయనే చెప్పాలి.కర్ణాటక జోష్ నే తెలంగాణలో కూడా ఉంటుందని.. కాంగ్రెస్ విజయం తథ్యం అనే ధీమాతో ఉన్నారు టీ కాంగ్రెస్ నేతలు. దీంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి అంటేనే మండిపడిపోయే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ తో కలిసి పనిస్తున్నారు. మేమంతా కలిసిపోయాం..తెలంగాణలో విజయం కోసం కలిసి మెలిసి పనిచేస్తాం అని ప్రకటించారు కూడా.

Gaddar New Political Party: కేసీఆర్ విధానాలు తప్పు.. దొరల పాలన పోయి ప్రజాపాలన కోసమే ‘గద్దర్ ప్రజా పార్టీ’

ఈక్రమంలోనే టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చేసిన పొంగులేటీ శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులను కాంగ్రెస్ లోకి చేర్చుకోవటానికి రంగం సిద్ధం చేస్తున్నారు రేవంత్, కోమటిరెడ్డి వెంకట రెడ్డి కలిసి. దీని కోసమే రేవంత్ కోమటిరెడ్డి ఇంటికి వెళ్లారు. ఇక జూపల్లి, పొంగులేటి చేరికలు షురు కానున్నట్లుగా తెలుస్తోంది. వీరి చర్చలు పూర్తి అయ్యాక నలుగురు కలిసి ఢిల్లీ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. వీరి చేరిక ఖరారు అయ్యాక సమావేశంలో చర్చించుకున్న అంశాలపై ఢిల్లీ అధిష్ఠానికి నివేదిక సమర్పించబోతున్నారు రేవంత్ రెడ్డి. పొంగులేటి, జూపల్లితోపాటు మరికొందరు చేరికపై కూడా చర్చించనున్నారు.