ESI శ్మశాన వాటికలో కరోనా రోగులకు గ్రాడ్యుయేట్ల అంత్యక్రియలు

  • Published By: madhu ,Published On : July 28, 2020 / 08:24 AM IST
ESI శ్మశాన వాటికలో కరోనా రోగులకు గ్రాడ్యుయేట్ల అంత్యక్రియలు

Updated On : July 28, 2020 / 12:04 PM IST

ESI శ్మశాన వాటికలో కరోనా రోగులకు ముగ్గురు యువకులు అంత్యక్రియలు చేస్తున్నారు. పీపీఈ కిట్లు ధరించి, మాస్క్ లు ధరించిన సిబ్బంది కొద్ది దూరంలో నిలబడగా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే పనులు చేస్తున్న యువకులు ఎవరు ? వారి గురించి విషయాలు తెలుసుకున్న వారు…ఆశ్చర్యపోయారు.

వారంతా విద్యావంతులు, పట్టభద్రులు. ఎందుకు ఈ పనులు చేస్తున్నారని ప్రశ్నిస్తే..కరోనా..తమ ఉపాధిని దెబ్బతీసిందంటున్నారు. ప్రమాదకరమని తెలిసినా..కుటుంబాన్ని పోషించుకోవడం ఈ పని చేస్తున్నామంటున్నారు.

ఒకరు బీకాంలో ట్యాక్సేషన్ లో పట్టభద్రుడు, మరొకరు బీఎస్సీ గణాంక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. ఇంకొకరు వ్యాపార సంస్థలో సూపర్ వైజర్, ఇంకోతను పదో తరగతితో చదువు ఆపేసి..ఆటో డ్రైవర్ గా ఉపాధి పొందుతున్నారు. అయితే..వీరి జీవితాలను కరోనా తలకిందులు చేసేసింది. ఉన్న ఉపాధి పోయింది. కుటుంబసభ్యుల బాగోగులు చూసుకోవాల్సింది వీరే. కానీ పనులు లేవు. ఏం చేయాలి ? చివరకు కాటి కాపరులుగా మారాలని నిర్ణయించుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా రాకాసి విస్తరిస్తూనే ఉంది. ఈ బారిన పడి..ఎంతో మంది చనిపోతున్నారు. నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది. సిబ్బందికి వైరస్ సోకకుండా ఉండేందుకు పీపీఈ కిట్లు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించారు. మొత్తం 22 శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేస్తున్నారు.

అందులో నగరంలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రి ఒకటి. 10 నుంచి 12 మంది కూలీలు బయటి నుంచి ఇక్కడ పని చేస్తున్నారు. ఇందులో ఎక్కువ శాతం ఉద్యోగాలు కోల్పోయిన వారే. ఒక్కో దహనం చేసినందుకు రూ. 500 నుంచి రూ. 1000 ఇస్తున్నారు. డెడ్ బాడీలను అంబులెన్స్ లో నుంచి దించడం, అంత్యక్రియలు పూర్తి చేయడం వీరి పని. అయితే..ప్రమాదమని తెలిసినా..తప్పడం లేదని అంటున్నారు.