కొమురంభీం జిల్లాలో ఇద్దరి ప్రాణాలు తీసిన ఏనుగు.. భయాందోళనలో ప్రజలు

తెలంగాణ వైపు మొదటిసారి ఏనుగు సంచారంతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. గ్రామాల్లో డప్పు చాటింపు ద్వారా అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

కొమురంభీం జిల్లాలో ఇద్దరి ప్రాణాలు తీసిన ఏనుగు.. భయాందోళనలో ప్రజలు

Elephant Attack

Updated On : April 4, 2024 / 10:10 AM IST

Elephant Creates Panic : కొమురంభీం జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. మహారాష్ట్ర నుంచి సరిహద్దుదాటి జిల్లాలోని రైతుల పొలాల్లోకి వచ్చిన ఏనుగు.. కనిపించిన రైతులపై దాడి చేస్తోంది. బుధవారం సాయంత్రం చింతలమానెపల్లి మండలం భూరెపల్లి గ్రామ సమీపంలోకి ఏనుగు వచ్చి మిరప పొలంలో పనిచేస్తున్న రైతు అల్లూరి శంకర్ పై దాడి చేసింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఏనుగు మనుషులపై దాడిచేస్తుందన్న విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పెంచికల్ పేట్ మండలం కొండపల్లి సమీపంలో ఇవాళ ఉదయం పోశన్న అనే రైతును ఏనుగు దాడిచేసి తొక్కింది. పోశన్న మృతిచెందాడు. దీంతో  సమీప గ్రామాల ప్రజలు బయటకు రావాలంటే భయంతో వణికిపోతున్నారు.

Also Read : Peddapalli Lok Sabha Constituency : పెద్దపల్లిలో బస్తీమే సవాల్‌.. ఈ ముగ్గురిలో విక్టరీ కొట్టేదెవరు?

తెలంగాణ వైపు మొదటిసారి ఏనుగు సంచారంతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. గ్రామాల్లో డప్పు చాటింపు ద్వారా అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఏనుగును వెంటనే తరిమేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అటవీ అధికారులు రంగంలోకిదిగి ఏనుగును బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొమురం భీం జిల్లాలోని సిర్పూర్, బెజ్జూర్, చింతలమనేపల్లి, కౌటాల మండలాలు మహారాష్ట్ర సరిహద్దున ఉన్నాయి. వీటివెంట ప్రాణహిత నది తీరం ఉంది. అవతల దట్టమైన అటవీ ప్రాంతం ఉండగా అక్కడి నుంచి పులులు, ఇతర జంతువులు జిల్లాలోకి ప్రవేశిస్తుంటాయి. కానీ, మొదటిసారిగా ఏనుగు రైతుల పొలాల్లోకి వచ్చి మనుషులపై దాడి చేస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Also Read : Balka Suman : ఇదేనా ఎస్సీ, ఎస్టీల‌కు ఇచ్చే గౌర‌వం? కాంగ్రెస్ పార్టీపై బాల్క సుమన్ ఫైర్

రెండు రోజుల క్రితం మహారాష్ట్ర గడ్చిరోలి అడవుల్లోకి ఏనుగుల గుంపు ప్రవేశించింది. దీనిలో ఒకటి విడిపోయి అటవీ ప్రాంతం మీదుగా ప్రాణహిత నుంచి జిల్లాలోకి ప్రవేశించినట్లు మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు ఇక్కడి వారికి సూచించినట్లు సమాచారం.