Muchintal And Icrisat : ప్రధానికి స్వాగతం పలుకనున్న సీఎం కేసీఆర్

శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో పాల్గొంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ స్వాగతం పలుకనున్నారు...

Muchintal And Icrisat : ప్రధానికి స్వాగతం పలుకనున్న సీఎం కేసీఆర్

Modi And Kcr

Updated On : February 5, 2022 / 12:30 PM IST

Modi Hyderabad : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు భాగ్యనగరంలో పర్యటించనున్నారు.. రెండు కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మొదట సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ ఏర్పాటై ఈ రోజుకు 50 ఏళ్లు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవాల్లో ప్రధాని పాల్గొని నూతన లోగోను ఆవిష్కరించనున్నారు. ఇక్రిశాట్‌ నుంచి నేరుగా ముచ్చింతల్‌కు చేరుకోనున్నారు ప్రధాని మోదీ. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో పాల్గొంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ స్వాగతం పలుకనున్నారు.

Read More : Statue Of Equality : ప్రధాన మంత్రి మోదీ కోసం విశ్వక్సేన ఇష్టి

శనివారం మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్ది కుమారుడి పెళ్లికి హాజరవుతారు. అటు నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి..ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలుకతారు. అక్కడి నుంచి రెండు హెలికాఫ్టర్లలో ఇక్రిశాట్ కు పీఎం మోదీ వెళ్లనున్నారు. మోదీతో పాటు ఛాపర్లో సీఎం కేసీఆర్ వెళుతారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో 7 నిమిషాలు ప్రసంగించనున్నారు సీఎం కేసీఆర్. అక్కడి నుంచి ప్రధానితో పాటు ముచ్చింతల్ కు సీఎం కేసీఆర్ చేరుకుని శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో పాల్గొంటారు. ముచ్చింతల్ లో ఆయన ప్రసంగించనున్నారు. ఆయన ప్రసంగం 8 నిమిషాల పాటు ఉండనుందని తెలుస్తోంది.

Read More : Golden Statue Satari : సమతామూర్తి బంగారు.. శఠగోపం వీడియో వైరల్

ఇప్పటికే ముచ్చింతల్ ఆశ్రమాన్ని స్పెషల్ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ రోజు సాధారణ భక్తులకు అనుమతులు రద్దు చేశారు. కేవలం ప్రత్యేక పాస్‌లు ఉన్న వారికి మాత్రమే అనుమతించనున్నారు అధికారులు. ప్రధాని భద్రతా కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ప్రత్యేక కమాండ్ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తం 8 వేల మంది పోలీసులు భద్రత విధుల్లో పాల్గొంటున్నారు. ప్రధాని ప్రయాణించే మార్గాల్లో ట్రయల్ రన్‌ పూర్తి చేశారు. ఇప్పటికే ప్రధాని మోదీ ప్రయాణించే ప్రత్యేక వాహనాలు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాయి. డీజీపీ మహేందర్‌ రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ రోజు దాదాపు 6 గంటల పాటు మోదీ హైదరాబాద్‌లో గడపనున్నారు.

Read More : Statue of Equality : నేడే ప్రధాని రాక.. రామానుజచార్యుల సువర్ణ విగ్రహావిష్కరణ

సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ ముచ్చింతల్ ఆశ్రమానికి విచ్చేస్తారు. అనంతరం యాగశాలకు చేరుకుంటారు. అక్కడ విశ్వక్సేన ఇష్టి పూర్ణాహుతిలో పాల్గొంటారు ప్రధాని మోదీ. విశ్వక్సేన ఇష్ఠి అనంతరం సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు భగవత్‌ రామానుజాచార్య సమతామూర్తి విగ్రహం చుట్టూ నిర్మించిన 108 దివ్యదేశ క్షేత్రాలను సందర్శించనున్నారు ప్రధాని మోదీ. ఆ తర్వాత రామానుజాచార్య స్వర్ణ విగ్రహాన్ని దర్శించుకోని సమతామూర్తి విగ్రహం వద్దకు చేరుకుంటారు. అక్కడే భగవత్‌రామానుజాచార్యుల మహావిగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసంగించనున్నారు. సమతామూర్తి లేజర్‌ షోను తిలకించి విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ.
సహస్రాబ్ది ఉత్సవాల్లో 1035 హోమగుండాల్లో దివ్యంగా జరుగుతున్న శ్రీలక్ష్మీనారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతికి మోదీ హాజరవుతారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత 5 వేల మంది రుత్విజులు మోదీకి ఆశీర్వచనాలు అందిస్తారు. 8 గంటలకు భవ్యధామంలో ప్రధాని మోదీ పర్యటన ముగుస్తుంది. అనంతరం శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుని ఢిల్లీ బయలుదేరతారు.