Statue of Equality : నేడే ప్రధాని రాక.. రామానుజచార్యుల సువర్ణ విగ్రహావిష్కరణ

రామానుజాచార్య విగ్రహం, యాగశాలలను ప్రధాని హెలికాప్టర్ ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు...

Statue of Equality : నేడే ప్రధాని రాక.. రామానుజచార్యుల సువర్ణ విగ్రహావిష్కరణ

Modi Shamshabad

Updated On : February 5, 2022 / 10:30 AM IST

Statue of Equality (Ramanuja) : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పటన్ చెరూలోని ఇక్రిశాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్ రామానుజాచార్య విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం హెలికాప్టర్ లో ఇక్రిశాట్, ముచ్చింతల్ కు మోదీ వెళుతారు. సమతాస్ఫూర్తి కేంద్రంలో మోదీ సుమారు మూడు గంటల పాటు ఉండనున్నారని తెలుస్తోంది.

Read More : Vasantha panchami 2022 : వసంత పంచమి సందర్భంగా బాసరకు పోటెత్తిన భక్తులు

రామానుజాచార్య విగ్రహం, యాగశాలలను ప్రధాని హెలికాప్టర్ ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సమతాస్ఫూర్తి కేంద్రం ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని పర్యటనలో 8 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. శ్రీరామనగరానికి దారితీసే దారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

Read More : Statue of Equality : సమతామూర్తి విగ్రహావిష్కరణ, పీఎం మోదీ వెంటే సీఎం కేసీఆర్

మోదీ పర్యటన ఇలా

2022, ఫిబ్రవరి 05వ తేదీ శనివారం మధ్యాహ్నం 2.10 శంషాబాద్ విమానాశ్రయానికి రాక
2.45 హెలికాప్టర్ ద్వారా ఇక్రిశాట్ కు రానున్నారు.
4.30 హెలికాప్టర్ ద్వారా ముచ్చింతల్ కు.
5.15 యాగశాలల సందర్శన

Read More : Statue Of Equality : సహస్రాబ్ది సమారోహంలో కీలకఘట్టం.. యాగశాలలో విష్వక్సేనేష్టి

6.00 విష్వక్సేనేష్టి యాగంలో పాల్గొంటారు.
6.05 నుంచి 6.35 వరకు దివ్యదేశాల సందర్శన.
6.35 గంటల నుంచి 6.40 వరకు రామానుజాచార్యుల సువర్ణమూర్తి సందర్శన.
7.00 గంటలకు రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ అనంతరం ప్రసంగం.
7.30 గంటల నుంచి 8.05 వరకు 3డీ మ్యాపింగ్ లేజర్ షో, యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు.
8.20 శంషాబాద్ నుంచి ఢిల్లీకి పయనం.