Golden Statue Satari : సమతామూర్తి బంగారు.. శఠగోపం వీడియో వైరల్

సమతామూర్తి బంగారు శఠగోపం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవంతో ఈ శఠగోపాన్ని వినియోగంలోకి తెస్తారని తెలుస్తోంది. అందులో

Golden Statue Satari : సమతామూర్తి బంగారు.. శఠగోపం వీడియో వైరల్

Satari

Updated On : February 5, 2022 / 10:08 AM IST

Statue of Equality : అష్టాక్షరీ మంత్రంతో ముచ్చింతల్‌లో పులకరించిపోతుంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన 5 వేల మంది రుత్విజుల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్విఘ్నంగా, వైభవంగా కొనసాగుతోంది. అయితే ఈ మొత్తం ప్రక్రియలో రెండు కీలక ఘట్టాలు కాగా.. అందులో ఒకటి 216 అడుగుల సమతామూర్తి భగవద్రామానుజుల విగ్రహం జాతికి అంకితం ఇవ్వడం. ఈ రోజు రాత్రి ఆ ఘట్టం భక్తుల ముందు ఆవిష్కృతం కానుంది. సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు నాలుగోరోజు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఈ రోజు వసంత పంచమిని పురస్కరించుకొని విజయప్రాప్తికై విశ్వక్సేన ఇష్టి, విద్యాప్రాప్తికి హయగ్రీవ ఇష్టిని నిర్వహిస్తున్నారు రుత్విజులు.

Read More : AP Employees Vs AP Govt : ఏపీలో పీఆర్సీ పంచాయితీ.. పెన్ డౌన్ కంటిన్యూ.. విద్యాశాఖ యాప్ డౌన్

ఇదిలా ఉంటే..సమతామూర్తి బంగారు శఠగోపం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవంతో ఈ శఠగోపాన్ని వినియోగంలోకి తెస్తారని తెలుస్తోంది. అందులో manepally .. Sri Ramanuja Sahasrabadi Golden Statue Shatari అనే పేరు గల బాక్స్ బంగారంతో తయార చేసిన శఠగోపాన్ని ఉంచారు. అది తెరిచి చూడగా.. శఠారిపై పాదుకలు, సమతామూర్తి బొమ్మలను కూడా ఏర్పాటు చేశారు. బంగారు రంగులో ఈ శఠగోపం వెలిగిపోతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో చాలా మంది దీనిని షేర్ చేస్తున్నారు.

Read More : Rahul Ramakrishna : ఇక సినిమాలు చేయను.. రాహుల్ రామకృష్ణ షాకింగ్ నిర్ణయం

తాటికొమ్మలు, వెదురుబొంగులతో నిర్మించిన 114 యాగశాలు, 10వందల 35 హోమకుండాలతో ముచ్చింతల్ అంతటా ఆధ్యాత్మికత ఆవరించింది. శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు 11 రోజుల పాటు సాగనుంది. దేశీ ఆవుపాలతో తయారుచేసిన స్వచ్ఛమైన నెయ్యి, హోమ ద్రవ్యాల సువాసనలు భక్తులను మరోలోకంలోకి తీసుకెళ్లనున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో రోజూ రెండుసార్లు యజ్ఞం జరుగుతుంది. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు జరిగే ఈ 11 రోజులూ… ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని..రోజూ కోటిసార్లు జపించనున్నారు. దీంతో.. దివ్యక్షేత్రం శ్రీరామనగరం.. నారాయణ మంత్రంతో మార్మోగుతుంది.