Eatala Rajender : బీజేపీ అధిష్ఠానం పిలుపు.. ఢిల్లీకి ఈటల రాజేందర్‌

ఢిల్లీ నుంచి ఈటల రాజేందర్ పిలుపు వచ్చింది. ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇవ్వటానికేనా? లేదా మరేదైనానా?

Etala Rajender

BJP MLA Eatala Rajender : హుజూరాబాద్ (Huzurabad) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Eatala Rajender) ఢిల్లీ (Delhi) కి బయలుదేరారు. బీజేపీ (BJP) పెద్దల నుంచి పిలుపురావటంతో ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఈ పిలుపు ఈటల రాజేందర్ ను ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇవ్వటానికేననే ప్రచారం జరుగుతోంది. ఈటలతో పాటు సీనియర్ నేత డీకే అరుణ (DK Aruna)కు కీలక పదవి అధిష్టానం అప్పగించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) తీరుతో రాష్ట్రంలోని బీజేపీలో రెండు వర్గాలు విడిపోయిందని అధిష్టానం గుర్తించిందని.. త్వరలో ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఇది పార్టీకి చేటు తెస్తుందని అధిష్టానం భావించింది. దీంతో గ్రూపులను రూపుమాపి అందరు పార్టీ అధికారంలోకి వచ్చేలా కృష్టి చేయాలని ఢిల్లీ పెద్దలు పదే పదే చెబుతున్నారు. వచ్చే ఎన్నికలకు ముందే ఆశావహులను పార్టీలో చేరేలా బీజేపీ యత్నాలు చేస్తోంది. ఈ బాధ్యతను ఈటలపై పెట్టింది అధిష్టానం. ప్రస్తుతం చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉన్న ఈటల ఆ బాధ్యత నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగానే మరి ముఖ్యంగా బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలపై కన్నేసింది తెలంగాణ బీజేపీ. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లిలను బీజేపీలో చేరాలని ఈటల పలు యత్నాలు చేశారు. వారిద్దరిని స్వయంగా కలిసి మరీ బీజేపీలో చేరాలని చర్చలు జరిపారు ఈటల. కానీ అవేవీ ఫలించలేదు.

పొంగులేటి కాంగ్రెస్ లో చేరటానికి మొగ్గు చూపారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నారు. మెజార్టీ అనుచరుల నిర్ణయం మేరకు కాంగ్రెస్ లో చేరాలని పొంగులేటి డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ లో చేరికపై జూన్ 12న ప్రకటన చేయనున్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ (BRS) తరపున పోటీ చేసే ఒక్క అభ్యర్థిని కూడా గెలవనివ్వనని..అసెంబ్లీ గేటు దాటనివ్వనని శీనన్న ఇప్పటికే ప్రకటించారు.

బీఆర్ఎస్ (BRS)నుంచి బయటకు వచ్చేసిన పొంగులేటి శీనన్న (ponguleti srinivas reddy) జూపల్లి కృష్ణారావు ( jupally Krishna raof)తో కలిసి పొంగులేటి రాష్ట్రంలో ఆత్మీయ సమేశాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం, వనపర్తితోపాటు పలు జిల్లాల్లో ఇద్దరూ కలిసి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో శీనన్న ఇక కాంగ్రెస్ గూటికి చేరనున్నారని ఖరారు అయ్యింది. ఇక జూపల్లి బాట కూడా అటేనా? మరి ఎటు అనేది తెలియాల్సి ఉంది.