KTR: వదిలేదు లేదు.. ప్రతి బొగ్గు గనిలో మళ్లీ అగ్ని మండిస్తాం- సీఎం రేవంత్ కు కేటీఆర్ వార్నింగ్
దోచుకో, దాచుకో స్కీమ్ నడుస్తోంది. ఏది దొరికితే అది దోచుకోవడం, తీసుకెళ్లి దాచుకోవడం. చాలా సిగ్గుచేటు. ముఖ్యమంత్రి మొత్తం కుటుంబం రాష్ట్రంలో దోపిడీకి పాల్పడుతోంది.
KTR: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ ఫ్యామిలీ రాష్టాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న సీఎం రేవంత్.. 30 నెలలు అయినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆదిలాబాద్ లో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకపోతే బొగ్గు గనిలో అగ్గి మండిస్తామని హెచ్చరించారు కేటీఆర్.
రేవంత్ రెడ్డి నికృష్టమైన రాజకీయం చేస్తున్నారు. మంత్రి, ఎంపీ కౌన్సిల్ హాల్ లోనే ఉన్నారు. బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లతో కాంగ్రెస్ కౌన్సిలర్లు వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తే చిరు నవ్వులు చిందిస్తూ కూర్చున్నారు తప్ప మంత్రి కానీ, ఎంపీ కానీ కనీసం వారిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ఇంత గలీజు రాజకీయం చూడలేదు. ఇంత నికృష్టమైన రాజకీయం చేసి వారు ఏం సాధిద్దామని అనుకుంటున్నారో తెలియడం లేదు.
నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ గా ఉన్న భట్టి విక్రమార్క.. మీరిద్దరే సంతకాలు పెట్టారు, మీరిద్దరూ గ్యారెంటీ కార్డులు అంటూ ఇంటింటికి వచ్చారు. మీరిద్దరే కదా జేమ్స్ బాండ్ లెక్క బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టింది. నూరు రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 30 నెలలు అవుతున్నా ఎందుకు అమలు చేయలేదు? 30 నెలలు అవుతున్నా 6 గ్యారెంటీలు అమలు కాకపోతే మిమ్మల్ని ఏమనాలి? ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిలా లేరు. మంత్రి మంత్రిలా లేరు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల లెక్క లేరు. మొత్తం అంతా ఒకే దుకాణం పెట్టారు.
దోచుకో, దాచుకో స్కీమ్ నడుస్తోంది. ఏది దొరికితే అది దోచుకోవడం, తీసుకెళ్లి దాచుకోవడం. చాలా సిగ్గుచేటు. ముఖ్యమంత్రి మొత్తం కుటుంబం రాష్ట్రంలో దోపిడీకి పాల్పడుతోంది. దమ్ముంటే నీ బావమరిది సృజన్ రెడ్డి మీద వెంటనే ఒక సిట్, ఏసీబీ విచారణ వేయ్. ఎవరు దొంగనో, ఎవరు దొంగతనం చేశారో బయటకు వస్తుంది. మీరు వేయాల్సిన విచారణలు మేము ఇచ్చిన 16వేల ఉద్యోగాల మీద కాదు. ముందు ఇక్కడ మెడికల్ బోర్డు పెట్టింది. లేదంటే సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ప్రతి బొగ్గు గనిలో మళ్లీ అగ్ని మండిస్తాం వదిలేది లేదు” అని సీఎం రేవంత్ ని హెచ్చరించారు కేటీఆర్.
Also Read: గులాబీ గూటికి జీవన్ రెడ్డి..! బీఆర్ఎస్ లెక్కలేంటి? కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి?
